తప్పిపోయిన కిరణం - 2

Link to Part 1.

నడిసంద్రపు మధ్యలో తేలుతున్న పత్రమై నేను
తీరం చూపించే మాయాచక్షువులు

అనంతవిశ్వపు శూన్యపు తెరపై రేణువునై నేను
అదృశ్య ధూళితీరాలు చేరే తపన 

వాస్తవస్వప్నిక సంధిలో  బందీ అయిన జీవాత్మను నేను
మాయ కమ్మిన వాస్తవమే స్వప్నమని మురిసే ఆత్మ 
మాయా స్వప్నమే వాస్తవమని మోహించే జీవం

దారి తెలియక సొమ్మసిల్లిన క్షణంలో,
అనంతవిశ్వపు శూన్యంలో అనంతమై,
నడిసంద్రపు నిరాశలో ఆశాసంద్రమై,
వాస్తవ స్వాప్నిక సంధిలో హద్దులు ధ్వంసం చేస్తూ,
జీవాత్మ ఘర్షణలో ఆత్మను లీనం చేసుకుంటూ,
అమృతసంద్రపు ఊయలలో ఊపుతూ,
నిలిచే పరమాత్మకు భావాంజలి

Engish Version:
I'm leaf floating in middle of endless Ocean
I see a coast formed by mirage

I'm a dust floating in middle of endless Galaxy

I wish to reach invisible clouds

I'm a soul trapped in tunnel of dreams and realities
Illusionistic reality seen as a dream by Soul
Illusionistic dream seen as reality by Life


When my cry is no longer audible, 
I bow to ultimate savior who came
As Infinity in endless empty Galaxy,
As hope in hopeless Ocean,
As destroyer of borders of dreams and realities,
As Soul guide ending confusions,
As parent playing with kid.

తప్పిపోయిన కిరణం


"తీరము దూరము
ప్రతిధ్వని శూన్యము
ఆశ దైన్యము
నడిసంద్రపు మధ్యలో తేలుతున్న పత్రమై నేను"
 - దుఃస్వప్నపు అలజడితో ఉలిక్కిపడిన వాస్తవం

"బాహ్యము దూరము
శూన్యమే శబ్దము
ఆశ తామసము
అనంతవిశ్వపు శూన్యపు తెరపై రేణువునై నేను"
- వాస్తవపు అలజడితో బెదిరిపోయిన స్వప్నం

వాస్తవస్వప్నిక సంధిలో  బందీ అయిన జీవాత్మను నేను
సముద్ర మథనంలో దారి తప్పిన గరళాన్ని నేను
కృష్ణబిలపు మలుపుల్లో ఆగిపోయిన  కిరణాన్ని నేను

(కొనసాగించ వలసి ఉంది)

EnglishVersion

"Coasts are far
Echos are empty
Hopes are blank
I'm a leaf floating in middle of endless ocean"
- Reality shattered from nightmare

"Reality is far
Silence is voice
Hope is dark
I'm a dust floating in middle of endless Galaxy"
- Dream frightened from reality

I'm a soul trapped in tunnel of dreams and realities
I'm poison lost it's way in making a nectar
I'm a light ray lost it's way in curves of blackhole

(To be continued)

- A special thanks to a friend who ignited this thought.

జ్వాలావాహిని


బూదికుప్పల తీరంలో జ్ఞాపకాల వెతుకులాట
చితిమంటల చీకట్లో వెలుతురుకై వెతుకులాట
జ్వాలావాహిని ప్రళయంలో ప్రణవానికై వెతుకులాట

బోసినవ్వుల మోములో బోసినవ్వుల హేల
మలిసంధ్య వెన్నెలలో తొలిసంధ్య వెలుగుల హేల
శిశిరతోటల్లో వసంత పక్షుల నృత్య హేల

కాలాలెన్నో మార్చే కాలం
కవచాలెన్నో మార్చే ఆత్మ
ప్రళయాలెన్నో దాటే ప్రణవం

[మరోసారి గీతాసారం గుర్తు చేసిన నాన్న మరణం]

English:

Searching for memories in heaps of ashes
Searching for light in darkness of  fire of pyre
Searching for life in flood from river of fire

Resonance of a sound of old laughs in the face of innocent laughs
Resonance of a sound of moon light rays at dawn of morning rays
Resonance of a sound of fall gardens by dancing of birds for welcoming spring

A time that changes many times
A soul that changes many armors
A life that beats many floods
[In remembering my father]


సంద్రం నా హృదయం

విశాల సంద్రంపై చంద్రుడు పరచిన శీతల వెన్నెల, ఉప్పెనగా ఎగసింది
జాబిలి నీ కళ్ళు,
సంద్రం నా హృదయం

సూర్యుడు విసిరిన వేడి సంకెళ్లలో సంద్రం బందీగా మేఘమై నిలిచింది
సూర్యుడు మన విరహం,
సంద్రం నా హృదయం

ధృవపు అంచుల నుంచి వీచిన గాలి మేఘపు సంకెళ్లు తెంచింది
వీచిన గాలి కరుణించిన కాలం ,
సంద్రం (కరిగిన మేఘం) నా హృదయం

నదులన్నీ మోసుకొచ్చిన గాధలు వింటూ సంద్రం పరవశిస్తోంది
నదులు మన ఇద్దరి భావాలు,
సంద్రం నా హృదయం