ఒక క్షణం సర్వం త్యజించిన యోగి నేను మరో క్షణం భవబంధాలకు బానిస నేను
సముద్రమంత ప్రేమ వర్షమై నన్ను తడిపేస్తే
ఎడారంత విరహం గ్రీష్మమై నన్ను కాల్చేస్తే
కాలమంత ఎడబాటు క్షణమై నన్ను కమ్మేస్తే
జీవితమంత వాస్తవం మాయలా నన్ను ముంచేస్తే