అతనితో సంభాషించనిదే నా ఉదయం తెలవరాదు
ఆ సంభాషణ అనేక విధాలుగా ఉంటుంది, అతని విస్తార జ్ఞానమల్లే
ప్రతీ సంభాషణా నా అజ్ఞానాన్ని హరిస్తూ ఉంటుంది
అతని కబుర్లు ఋతువులవలే భలే చిత్రంగా ఉంటాయి
హేమంత బిందువుల్లా ఉల్లాసాన్నిస్తూ, హఠాత్తుగా గ్రీష్మమై ఆవేశపడతాయి
వర్షంలా ఆర్ద్రత కురిపిస్తాయి శిశిరమై నమ్మకాలను కుదుపుతాయి
శరత్ రూపమై చల్లబరుస్తూ వసంతమై విహారాలు చేయిస్తాయి
ఎక్కడున్నావని తలెత్తి చూస్తే ఇదిగో అంటూ సహస్రకిరణాలతో ఆలింగనం చేసుకుంటాడు
అతని ముందు నే చిన్నిపిల్లాడినై నిలుచుంటా
నిత్య యవ్వనంగా ఉంటూ నాతో మబ్బుల చాటున దోబూచులాడుతుంటాడు
పంచభూతాలూ ఒక్కటై అతని మాటలు నాలాంటి వారికి తర్జుమా చేస్తుంటాయి
ఒకనాడు కొండపై నుంచుంటే పిల్లగాలి హోరు మధ్యలో అతని మాటలు విస్పష్టమై వినిపించాయి
మరొకనాడు సముద్రతీరంలో నడుస్తుంటే అలలు స్పర్శిస్తూ తడిమి పలకరించాయి
రోహిణీకార్తిలో పగిలిన రాళ్ళ సెగలు అతని ఆవేశాన్ని రుచి చూపించాయి
మబ్బులు కమ్మిన రోజుల్లో మట్టివాసన అతని మాటల ఘుభాళింపు చాటింది
గ్రహణాలు దాచలేని అస్తిత్వం అనంతమై అతన్ని దర్శనం చేయించింది
విశ్వంలో ఎక్కడ ఉన్నా నా వెంట ఉండే ఏకైక ప్రియనేస్తం, సూర్యుడు
"ఆ ఉషాకిరణాలు తిమిర సంహరణాలు,
నిత్యం తిమిరాన్ని ఖండించే ఖడ్గాలు "