ఏడు జన్మలు

ఏడు అడుగులు వేస్తే ఏడు జన్మలు
జీవితాంతం కలిసి నడిస్తే ఎన్ని జన్మలు?

మొదలెక్కడ ఏడు జన్మల లెక్కకి
తుది ఏది జన్మజన్మల బందానికి?

స్వరాల అడుగులు ఏడు దగ్గర ఆగిపోతే
అనంతరాగాల సృజన ఎక్కడిది?

అగ్ని సాక్షిగా రెండు మనసుల ఏడు జన్మల ఋణబందం
పరమాత్మ సాక్షిగా పరమాత్మతో ఎన్ని జన్మల ఋణబందం?

ఎదురుచూపు

తన నిద్ర ముగియక ముందే బతుకాట మొదలెట్టిన తండ్రి కోసం
తన మెలకువ ముగియక ముందే ముద్దాడే క్షణం కోసం
మలిసంధ్యలో ఉదయించే సూర్యుడి కోసం
ఒక పసివాని ఎదురుచూపు

తన నిద్ర ఎప్పుడు సుదీర్ఘమవుతుందో తెలియక,
తన వేకువలో చీకటి ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ
మలిసంధ్యలో ఉదయించే సూర్యుడి కోసం
ఒక ముదుసలి ఎదురుచూపు

తన రోదన వేదనలో ఆనందం వెతుకుతూ
తన రోదన మలిసంధ్యలో ఉదయించే బిడ్డడి కోసం
ఒక తల్లి ఎదురుచూపు
---
A kid waiting,
For a father who started his work before sleep was done
For a moment to kiss father before beginning of sleep
For a sun that rises at evening

A old person waiting,
For an unsure moment when sleep becomes long sleep
For a moment when day of life becomes night
For a sun that rises at evening

A mother waiting,
Searching for happiness in her pains
For rise of baby at end of her cries

---
Note: The second part is especially for old parents living far from their kids. Who usually only speak at end of day with each other.
For such parents, end of day is real sun rise.