నీవే

సుస్వప్నపు మధురానుభూతిలో నీవే
దుఃస్వప్నపు భీతిలోనూ నీవే

వెలుగు నడిచిన ప్రతిచోటా నీ అడుగుల నీడలే
చీకటి ఏలిన ప్రతీ కోనలో నీ అడుగుల వెలుగులే

సప్తస్వరాల కలయికలో నీ నవ్వుల సవ్వడులే
నిశ్శబ్దపు ముద్రలో నీ మౌన భాష్యాలే

----
In a good sleep's blissful mood, it is you
In a nightmare's dreadful mood, it is you

In every path the light walked, it is shadows of your walk
In every corner the dream ruled, it is lights of your walk

In fusion of musical tones, it is song of your laugh
In time of silence, it is speech of your silence