వసంతపు పూతనై విరిసేందుకు, శిశిరపు చిగురునై రాలుతున్నా
ఏరునై పైరుని కలిసేందుకు, మేఘమై వర్షిస్తున్నా
క్షణమై నిలిచేందుకు, క్షణమై కదులుతున్నా
ఉదయసంధ్యనై నర్తించేందుకు, సాయంసంధ్యనై నిష్క్రమిస్తున్నా
అస్తిత్వమై నిలిచేందుకు, పోరాటమై ముగుస్తున్నా
భువిగంగనై పారేందుకు, ఆకాశగంగనై దూకుతున్నా
బంధమై బిగిసేందుకు, దూరమై కరుగుతున్నా
ముత్యమై మెరిసేందుకు, చుక్కనై బందీనవుతున్నా
అనంతమై నిండేందుకు, శూన్యమై బద్దలవుతున్నా
సత్యమై వెలిగేందుకు, అసత్యమై సమిధనవుతున్నా
వైకుంఠపు కాపు కాసేందుకు, రావణుడినై ధిక్కరిస్తున్నా
ఆత్మనై జీవించేందుకు, దేహమై మరణిస్తున్నా