చేప చంద్రుడు

మా ఊరి చేపల హృదయమూ, ఆ చంద్రుడు ఒకటేనట
మేఘాల కోసం పిచ్చిచూపులు చూస్తూ ఎదురు చూస్తుంటాయి
హృదయంలో మౌనంగా ప్రార్ధిస్తుంటాయి మేఘాలను రమ్మని
ఆ తపోశక్తికి వచ్చిందో తేజస్సు
చంద్రుని చుట్టూ దూరంగా ఏర్పడిందొక రంగుల వలయం
తపము తీవ్రత పెరుగుకొద్దీ తేజస్సు యా హృదయములోనే కలిసింది
చంద్రునిలో లీనమయ్యింది ఆ రంగుల వలయము
మేఘ దర్శనముతో పులకించింది మత్స్యము

చేపలకు వల వేసి పట్టారు జాలరులు
తపోశక్తి తగ్గసాగింది
హృదయతేజము మసకబారసాగింది
అమాస వచ్చి అదృశ్యమై మరల వచ్చాడు చంద్రుడు పున్నమితో
ఈ సారి చంద్రుని చుట్టూ కానరాలేదు ఆ వలయము
బహుశా చంద్రుడు తపము చేయబూనినాడేమో
మరో వరుణకాలము కొరకు, ఏనాటికి ఫలించేనో ఆ తపము,

(మరువం ఉష గారు చేయుచున్న జలపుష్పాభిషేకానికి నేను సమర్పిస్తున్న మూడవ జలపుష్పమిది)

4 comments:

మరువం ఉష said...

నల్లటి వాన మబ్బుల్లో దాగిపోతూ కూడా బంగరు వర్ణంలో మెరిసే చంద్రుడిని జ్ఞప్తికి తెచ్చారు. వానల్లు లేక అల్లాడే చెరువులు, ఏర్లు, ఎండిన కాలువల్లో జాలర్ల చేతికి చిక్కే చేపలు. May all part of food chain and natural balance for some to be eaten. Yet hard to conceive from a poetic and kind heart

Unknown said...

You got me perfectly, That is the scene of inspiration to write this.

carth said...

chaalaa baagaa raasaaaru

Unknown said...

Thank you Carth