చేప చెప్పిన ఊసులు

అంత:పుర భవనమ్మున అలక పూనెను ఓ రాణి
అలకపాన్పును వదిలి సైకతపానుపుపై పవళించెను ఆ సొగసరి
చిలక తెచ్చిన కబురందుకొని సైకతవేదికనలంకరించెను రాతిగుండె రారాజు
పలుకరింప మొగము తిప్పుకొనె ఆ వయ్యారి
భామతో వైరిమార్గమేలనని ఒరలోన దాచె కరవాలము, చేత ధరించె జాలము
ఎటుల అలక తీర్చునోయని ముచ్చట చూచుచుండె పున్నమిరేడు

ఈ జంట చింత తెలియని ఒక కుర్రచేప పక్కనున్న కొలనున నింగిని ముద్దాడ ఎగిరి దూకె
ఆ చేపను చూడగనె చిరునవ్వు వెలికివచ్చె భామ మోమున
ఒక వింత ఆలోచన వచ్చె ఆ మగని మనసున
"కనులు మూయక నా కొరకు ఎదురు చూచుచూ
నన్ను ముద్దాడ ముందుకు దూకి అంత మరల వెనుకకు మరలి
ఏలనో నీకీ పంతము. ఎదుట నే నిలిచినా అంతలో వెనుకకు మరులటేల "
అని చేపతో పలుక, గడసరి మగువ
"కనులు మూసిన ఎచటకు పోవుదువోనని నిదురునైనా కనులు మూయకుంటుని
కనులముందున్నా చెంతకు చేరకుంటివి
చెంతకు చేర నే దుమికినా దరికి చేరనంటివి"
అని తానే మత్స్యసుందరియై సమాధానమిచ్చె

ఇది విన్న యా చేప
"అది అలక కాదు,కులుకేనని తెలియని రాజువైతివి
మంచిదైనది కోపాన్ని మనసు పొరన దాచి,
నవయువకుడవై సమ్మోహనుడవై చేప కన్నుల సుందరి కొరకు వచ్చితివి
మనసున దాగిన ప్రణయమును మాటన చెప్పకుంటివి
నటనమున చూపకుంటివి
నా విహారము చెప్పించినదిలే నీ మనసున దాగిన ప్రణయపు మాట"
అని తర్కించి ఆ రాజు జాలమున ప్రవేశించె,
యా చేపను చేతిన తీసుకుని ముద్దాడబోవ,
మీనాక్షియగు యామె కించిత్ అసూయన జలపుష్పమును జన్మస్థలమునకు చేర్చె

అలకయేల వచ్చెనో మరిచెను యామె
జాలమేల తెచ్చెనో మరిచెను ఈతడు
సైకతపానుపుపై విరహమును మరచి విహారము సాగించుచుండిరి
ఈ విహారము చూచిన యా పున్నమిరేడు మబ్బుల కిటికీ మాటుకు చేరి మరో జంట ఎచటా యని శోధించసాగె

(మరువం ఉష గారు చేయుచున్న జలపుష్పాభిషేకానికి నేను సమర్పిస్తున్న జలపుష్పమిది)

11 comments:

మధురవాణి said...

చాలా చాలా బాగుందండీ మీ జలపుష్పం :)

చిన్ని said...

జలపుష్పాలు!....చాలా ......బాగుందండి .

ఉష said...

Thanks for penning down this gem upon my request.

ఎందుకో నల-దమయంతులు, దుర్యోధన-భానుమతులు గుర్తుకు వచ్చారు. ఎంతటివారలైనా వలపు వలలో చిక్కినాక ప్రేమికులే కదా!! ప్రణయలోక విహారులే కదా...

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగుంది ప్రదీప్ గారు.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

అందరికీ అభివందనాలు, ధన్యవాదాలు

Nutakki Raghavendra Rao said...

అర్జునా! వుష గారి చేపల కొలను లోకి చేపను విసిరినట్లే విసిరి, మీ కవితా బాణాలతో ఇలా మా వీక్షకులకు గురి పెట్టడం నీకు న్యాయమటయ్య ?......అధ్భుత కవితా కధనం.....అభినందనలతో....నూతక్కి రాఘవేంద్ర రావు.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

నూతక్కి రాఘవేంద్రరావు గారు,
I'm flattered :) thanks

నేస్తం said...

చాలా బాగుంది ప్రదీప్ :)

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

నేస్తం,
చాలా రోజుల తర్వాత పునర్దర్శనం. ధన్యవాదాలు .

కుమార్ said...

ఈ విహారము చూచిన యా పున్నమిరేడు మబ్బుల కిటికీ మాటుకు చేరి మరో జంట ఎచటా యని శోధించసాగె

బాగుంది ప్రదీప్ గారు. టచింగ్ గా వుంది. నేనూ జలపుష్పాభిషేకంలో భాగమయ్యేందుకు ఈరోజే రాసాను చూడండిhttp://www.sahavaasi-v.blogspot.com/

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

thx kumar,