పాడెడి వాడు భక్తుడైతే,
శిలలో కనిపిస్తున్న ఆ దేవుడు కరిగి
ఆ భక్తుని హృదయాన్ని ముంచెత్తడా
విశ్వరూప దర్శనం చూపడా
హృదయమే పాషాణమైతే
ప్రియసఖి నోటి మాటే సామవేద సంగీతమవ్వదా
ఆ హృదయం కరగదా
ఆనందం అర్ణవమై కన్నుల ఆనకట్టలు దాటదా
( కలవరమాయె మదిలో సినిమాలో పాటలో ఒక వాక్యం పైన టైటిలు. అది నచ్చి, ఇలా సంబంధం లేకుండా రాస్తున్నాను. )
7 comments:
ఈ మద్య కాస్త తీరిక లేక మీ పోస్ట్ లను మిస్ అయ్యాను చాలా బాగా రాసారు ప్రదీప్ గారు :)
ఊ ఊ మొత్తానికి, కాలు మోపీ మోపగానే కరిగిపోయారన్నమాట, ఎంతైనా అది స్వర్గం అని వింటూనేవున్నాము కదా. ఇక గంధర్వ గానాలకి ఏమి కొదవ? ఎవరో మధుర గాన ప్రియసఖి? ;) అయినా పాపం ఎన్ని సార్లు "జగదేకవీరుకథ" లేక "భైరవద్వీపం" చూసి సాధన చేయాల్సివచ్చిందో కదా. "కన్నుల ఆనకట్టలు" వూహకి చాలా హృద్యంగా, ఆర్థ్రత బింబిస్తూవుంది. మీ కలం కూడా ఆగనంటుందా, వెళ్ళింది ఎక్కడా, విరామం తీసుకున్నదెక్కడా?
నేస్తం గారు,
మంచిది, ఇక ఆపకుండా మొత్తం చదివెయ్యండి
ఉష గారు,
దాన్నే ఆవేశం అంటారు. నేను ఇది రాసింది న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ lO కూర్చుని.
ఆ మధుర గాన ప్రియ సఖి ఎవరో తెలిస్తే కదా మీకు చెప్పేది
సంబంధం లేకుండా చెప్తున్నాను అని మీరు అంటున్నా, మీరు చక్కగా చెప్పారు అని నేను కిరాబిస్తున్నాను. మీరు చాలా బాగా వ్రాస్తారండి.
సాయిప్రవీణ్ గారు,
బాగుంది, ఇక్కడ నాకు దగ్గరలో మునగచెట్టు కనిపిస్తోంది....
మునగ చెట్టు, కొత్తమీర చెట్టు ఎందుకండి. మీ బ్లాగులో చాల్రోజుల ముందు కూడా నా స్పందనను తెలిపాను. నేను నిజంగానే మిమ్ములను అభినందిస్తున్నాను. మీరు వేరు తప్పుడు అర్థాలు ఎందుకు గ్రహిస్తారు. అక్బరు దర్బారులోని తాన్సేన్ పాడితే వర్షాలు కురిసేవట, ఇంకా దీపాలను కూడా పాటతోనే వెలిగించేవాడట.
సాయిప్రవీణ్ గారు,
అయ్యో అలా అపార్ధం చేసుకున్నారా... నేను ఇది(ఈ టపా) రాసినప్పుడు చాలా అలసటలో ఉన్నాను. వచ్చిన భావాలు అలా పెట్టేసాను. అందుకే మొదట భక్తి రాసి వెనువెంట ప్రేమ చూపి అంతలో ముగించేసాను.
మునగచెట్టు అన్న కారణమేమంటే, రాసిన నాకే ఏదో చిన్న అపరాధ భావన, ఏమిటిలా రాసాను అని. అలాంటిది మీరు బాగుంది అనేసరికి అలా అనిపించింది అంతే గానీ మీ హృదయపూర్వక అభినంధనను కించపరచడం కాదు.
Post a Comment