గంగమ్మ పరవళ్ళు

ఎక్కడ బయలుదేరిందో ఆ గంగమ్మ
ఎక్కడైనా ఒకటే గమ్యమట,
సంద్రపు ప్రియుడిని చేరడమేనట
కొండలలో మొదలై
ప్రియుని వెతుకుతూ పరవళ్ళు తొక్కుతూ
జలపాతమై దూకి
సర్వశక్తులతో రాళ్ళను పక్కకు తోసి
లోయలలోతులు నింపి
సుడిగుండమై మధనపడి
ఇసుకఎడారిని దాటి
రాత్రైనా పగలైనా
విరహపు వేసళ్ళు ఎండగట్టినా
ప్రియుని మేఘ సందేశాలు హృదయాన్ని నింపినా
శీతలపవనాలు ఆమె పయనాన్ని ఆపే ప్రయత్నం చేసినా
ప్రియుని చేరిందట
ఆ పరవళ్ళతో ప్రియుని ముంచాలని ఆమె ఆరాటం

చేరవచ్చిన ప్రియురాలిని కౌగలించుకోను అలల చేతులు జాపాడు ఆ సముద్రుడు
తనలో దాగిన శంఖంతో ఆమెకు స్వాగతగీతం పాడాడు
ఆ ప్రియుల కలయికతో పరవశించిన నదీసంగమం కొత్త పరవళ్ళు తిరిగంది
ఎన్ని సుడుల నాట్యాలు చేసారో ఆ ప్రియులు
(నయాగారా జలపాతం చూసాక మనసులో పొంగిన ఒక భావం)

5 comments:

మరువం ఉష said...

బాగుంది. బాపు "సీతాకల్యాణం" లో గంగావతరణం చూసారా? నయాగరా నేను చూడలేదు కానీ ఏ జలతరంగిణిని చూసినా మీ కవితలోని భావనే తోస్తుంది. నదిలోని మీరు వర్ణించిన తత్వం కారణంగానే కొందరిచేత my life is like a river అనిపిస్తుందేమో!

Dileep.M said...

very good...

Dileep.M said...

భావం సూపర్
I feel Not up to the mark

ఇది ఇంకోసారి మళ్ళీ రా(వ్రా)యి. చదువుతో వుంటే గంగ ప్రవహిస్తోంది అన్న విధంగా పదాలు ధ్వనించాలి.

---

Unknown said...

@ఉష గారు,
నిజమే ఏ జలతరంగిణి అయినా అదే భావం. కానీ నయాగారా జలపాతం చాలా పెద్దది కదా.. ఇదే నేను చూసిన మొదటి పెద్ద జలపాతం.
@దిలీప్ ,
నిజమే నేను కూడా అదే అనుకున్నా, ఎందుకంటే తొందరలో రాసినదే. గంగ ప్రవహిస్తోంది అన్న పదాలు రాయాలంటే మళ్ళీ "అటజని కాంచె" రాస్తే పోలా... ప్రయత్నిస్తాలే మళ్ళీ రాయడానికి :)

మరువం ఉష said...

నయాగరా మీలో స్పందనకి కారణమైనట్లే, నా కవిత గోదారమ్మ పరవళ్ళు, కృష్ణమ్మ ఉరవళ్ళు అచ్చంగ నావేనమ్మా! http://maruvam.blogspot.com/2009/05/blog-post_30.html అలా అనుభూతి నుండి పుట్టినదే. నాగార్జునసాగర్, శ్రీశైలం, ధవళేశ్వరం డాం గేట్లు ఎత్తినపుడు కృష్ణ, గోదావరుల పరవళ్ళు, అలాగే పిన్నవయసులో నేను చూసిన నాగార్జునసాగర్ దగ్గర "ఎత్తిపోతల" జలపాతం నాకు అలాగే అనిపించాయి.