శ్వేతమోహిని


దూది పింజ, వెన్న ముద్ద, వెండి కొండ, పాల పొంగు
ఏమని పిలిచిననేమి తెల్లమబ్బు అందాన్ని

కొంటేవాడివైతివేమి సూరీడా
సనసన్నని కిరణాలతో తెల్లమబ్బు కౌగిలింత కోరితీవి
నిర్మల శ్వేతమేఘం జలధి కావాలాని కోరిందా
?సంద్రమంతా కలియవచ్చి , నీటినంత పీల్చివేసి
తడితడి పెదవులతో శ్వేత మేఘాన్ని తామసముఖి చేసి ఎచ్చటకేగితివి

గంగా ప్రవాహాన్ని చూసి ముచ్చటపడి గజగామిని
పవనుడి తోడు కోరింది
ఆకసాన్ని ఇట్టే కొలిచేసి కిందకు దుమికింది

పర్వత ఝటాఝూటంలో బందీ అయ్యి
జలపాతమై దుమికి నదిలో కలిసి సంద్రంలో మునిగి
సూర్య-సంద్ర మధనంలో శ్వేతామృతమై తేలి వచ్చింది

5 comments:

Padmarpita said...

Wow....after a long time with good post!

జీవన పయనం - అనికేత్ said...
This comment has been removed by the author.
రవిశేఖర్ హృ(మ)ది లో said...

ప్రకృతి చక్రాన్ని అందమైన కవితలో మరింత పొందిక గా పొదిగారు.మంచి పదాలతో ...

రవిశేఖర్ హృ(మ)ది లో said...

మీ బ్లాగు టైటిల్ క్రింద మీరు వ్రాసిన కామెంట్ చాలా బాగుంది.

శ్రీ said...

చాలా చక్కని భావం...
జలపాతమై దుమికి నదిలో కలిసి సంద్రంలో మునిగి
సూర్య-సంద్ర మధనంలో శ్వేతామృతమై తేలి వచ్చింది
@శ్రీ