రవి కాంచనిదేదో నటనమాడెను

హద్దులు ముక్కలు చేస్తూ ఘర్జనతో భయాన్ని భయపెడుతూ 
తానే చక్రవర్తినని ప్రకటిస్తూ
కాళ్ళను పట్టిన సంకెళ్ళను తెంపుకుని లంఘించినదొక సింహం

మబ్బులు గొడుగు పడుతుంటే
కొంగ్రొత్త కాంతితో వికసించెను ఉదయం
మునుపెన్నడూ తెలియని వర్ణంలో మెరిసెను వసంతం


అద్దం తెలుపని అందమేదో చూపింది ఎదనయనం 
కలం పలుకని పదమేదో పాడింది గీతం
రవి కాంచనిదేదో నటనమాడెను వేలికొన చివరన

ప్రకృతి చూపని పారవశ్యం పొందింది హృదయం
నిర్జన నిర్జీవ ఎడారిలో నిండింది జీవం
ప్రపంచమెరుగని ప్రదేశం వెలిసింది నవ విశ్వమై 

2 comments:

Padmarpita said...

Wow nice feel:-)

Unknown said...

ఏంటో చదువుతుంటే కళ్ళముందేదో అద్భుతం చూసిన భావన కలిగింది. ఆ అధ్భుతం ఏంటో అర్ధం కాలేదు కానీ...పదాల లయలు బాగా పలికించారు.