విహంగం నేనైతే

విహంగమై దూసుకుపోవాలి,
మబ్బుల మాటున దాగిన ఆకసంపై కాలు మోపాలి
ఆచార్యదేవోభవ
! సూరీడికి నమస్సులు
సూరీడు తెలిపే
అంతరిక్ష గమనపు వింతలు
పాలపుంతల దారులు, తోకచుక్కల దోవలు
చుక్కలలో‌దాగిన చిక్కుముడులు
, చిత్రాలు తెలుసుకొని ముందుకు సాగాలి

పాలపుంతల లెక్కలు , తోకచుక్కల గాలిపటాలు
లెక్కల లోతెందుకులే
, పాలపుంతలో‌విహరించి
తోకచుక్కల గాలిపటాలపై సందేశమంపాలి

ఎంతమంది చక్కని చుక్కలు విహరించారో ఈ ఆకసాన,
చుక్కలలో‌దాగిన చిత్రాలు బోలెడు
ఆ చిత్రాలలో నా చెలి గీసిన చిత్రం వెతకాలి
ఆ చిత్రం‌అందుకుని తోకచుక్కపై పయనించి
మబ్బులపై వాలి
,
తడి చినుకుల ముద్దులు పంపాలి

ఆ చినుకులలో‌తడిసిన నా చెలి ముందు నిలవాలి
విహంగాలై ఇద్దరమూ జీవన అంతరిక్షయానత్ర సాగించాలి

1 comment:

మరువం ఉష said...

సూరీడు నేనైతే..
[సరదాకే సుమా!]

మానవా! నేనున్నది ఓ పాలపుంత
మిగిలిన జగమంతా నాకో వింత
లెక్కలేనన్ని రోదసి దారులు
బాలభానుడను, నీకేమని నేను తెలుపను?
తోకచుక్కల జాడలకై అదిగో ఆ తారలు
తగవులాడుకుని, గ్రహకలశాలలో కీచులాడుకుని
ఉల్కలై నేల వాలుతున్నాయి
కనుక నీ త్రోవ ముడులు నీవె తెలుసుకొనుము.

మబ్బుల్లో మత్త్తుగా విహరించినా,
మమతానురాగాల జల్లులు కురిపించినా
నెచ్చెలి తలపుల్లో నెలరాజువైనా
నీకు కాదా తగునది, మరిక జాగేలనయా,
వేగిరపడి జంట విహారానికి మరలిరా
నా చెలి ఛాయను వేడి, నీకొక చిత్రం కానుకిచ్చెదను..