మరణపు కౌగిలి నుంచి వెలికి వచ్చినట్టు
మండే గుండెల మంట ఆరినట్టు
అలసిన మేనికి నీరందినట్టు
ఏమని చెప్పను ఈ క్షణాన్ని
నడి సంద్రంలో తీరం కనిపించినట్టు
రాలిపోతున్న మేనికి రెక్కలొచ్చినట్టు
చీకటికోటలో వెలుగు దివ్వె దొరికినట్టు
ఎలా చూపను ఈ ఆనందాన్ని
విజయతీరాన్ని చేర్చే చివరిఅడుగులో దాగిన ఉత్సాహం
విజయపు శిఖరంపై నిలిచిన క్షణమాత్రపు గర్వం
ఆ క్షణం అంతమెరుగని అనంతం
ఆ ఆనందం ఎంత చూచినా తరగని సాగరం
ఆ ఉత్సాహం మరో మజిలీకి శ్రీకారం
7 comments:
సత్యం..
విజయం వెంబడి వైఫల్యం
వైఫల్యం వెంబడి విజయం
విజయమైనా, వైఫల్యమైనా
క్షణమాత్రమనుభూతి.
ఆ క్షణం అనంతం..
కాలాన్ని క్షణక్షణంగా ముక్కచేస్తే చివరకు మిగిలేది సప్తవర్ణానుభూతుల హారం. ఆ స్ఫటికశకలాల్లో మెరిసేది విజయం, నలుపులో లయమయేది భయం, అపజయం, మరణం, నైరాశ్యం. హరివిల్లు మనసున విరియింపజేసేదే జీవితం.
ఈ క్షణం అనంతంలో దాగివున్నది నగ్నసత్యం...very nice!
చాలా బాగుంది ..
నూతన సంవత్సర శుభాకంక్షలు..
నా కానుకగా ఈ టపా అందుకోండి
http://creativekurrodu.blogspot.com/
నీ చేరువలో నా కదలిక ఒక స్వప్నం,
మూసిన కన్నులలో కొలువున్న నీ రూపు అమోఘం,
నీ ఆనందం చూడగలిగిన క్షణం నా జన్మ ధన్యం,
ఆ క్షణమే నాకు అనంతం..
కె క్యూబ్ వర్మ గారు,
అది అనునిత్యం సత్యం
శ్రీనిక గారు,
విజయం వైఫల్యం ఏదైనా కొన్ని అనుభూతులు క్షణమైనా అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది (ఉంటాయి)
ఉష గారు,
ఏంటబ్బా, హటాత్తుగా హరివిల్లు దర్శనానికేగారు
పద్మార్పిత గారు,
సూటి వ్యాఖ్య చేసారు
మాధవ్ ,
మీ కాలెండర్ చూసా, బాగుంది
రత్నమాల,
ఒక్కొక్కరికి ఒక్కో క్షణం అనంతం, విజయం సాధించిన క్షణమైనా, ప్రియుని చూసే క్షణమైనా అది అనంతమే
Post a Comment