అనంత వృత్తం

దూరాన నిలిచింది దీప శిఖరం..
మరో దిక్కున అంతు తెలియని
కారు చీకట్ల విలయ తాండవం

దీప శిఖరమువైపు అడుగెయ్యబోతే చీకటిన
నా పాదాలనేదో ఆపింది,
ఆపి తన చేతులు జాపింది, చీకటిలోనికి ఆ చీకటి లోకానికి పిలిచింది

కన్నులు మరల్చలేని అందమే అయినా నా
కన్నుల చీకటి పొర కమ్మింది, తడబడుచున్నవి అడుగులు
కన్నులు చూపని దారిని వెతుకుతూ

ఎంత తిరిగినా ఆ శిఖరం దరి చేరదు
ఈ తామసి నను వదలదు
ఏ తోవన పోవాలో, ఈ దూరాన్ని ఎలా తుంచాలో

అరె, ఇదేమి నేను మొదలిడిన చోటుకే మరలా వచ్చితిని
హరీ, ఇది రేఖా యానమా, వృత్త పరిభ్రమణమా
దారేది, నన్ను పిలుచు దీప కళికను చేరేదెలా

క్షణము ఆగి లంబ కోణమున అడుగు వేసా
గణించ వీలు కాని శక్తులు నిరోధించ
రణమున ఏకాకినైతినా?

ధిక్, నన్నే ఆపు శక్తులా అనుకున్న క్షణమే రెట్టింపాయే
కానరాని నా విరోధములు, దీపమునే చూచుచూ
కనులు మూసి అడుగు వెయ్య

ఒక్కొక్కటిగా రాలిపోయె విరోధములు
రక్కసి చెర నుండి విముక్తి వచ్చేనేమో
రక్కసే మరో రూపు దాల్చెనో,

మరో మారు ఏదో ఆపింది
దూరానున్న దీప కళిక
చిరునవ్వులు చిందిస్తోంది

ఇదిగో మరో మారు అనంత వృత్తంలో ప్రవేశించా
దేదీప్యమైన దీప శిఖరమేనా కన్పించని
కేంద్రము, ఈ జీవిత గమ్యము

మరెన్ని సుడులో ,
మరెన్ని మలుపులో
పరిధిని కుదించి కేంద్రమును చేరుట
కొరకేనా జీవనము? ...

ఇంద్రియాల బంధనాలు చీకటులు
ఆ దేవుని చూపులు దీప కళికలు
ఆ చూపును చేరునంతలో అంతు తెలియని అనంత వృత్త పరిభ్రమణాలు

11 comments:

Hima bindu said...

చాలా చాలా బాగుంది .

మరువం ఉష said...

Pradeep, Almost sure, must be an inspriration from your own comment to my kavita at http://maruvam.blogspot.com/2009/07/blog-post_28.html

yes? first comment. More to follow..

Unknown said...

@Chinni
Thanks
@Usha gaaru,
No, it is not inspiration from comment on your blog. It is a thought I'm trying to pen down from past 2 weeks. Co-incidentally it was written on your blog. Actually this title coined when trying to give a meaning for "35" as "ce" and there come "Circle of Eternity"......and hunting me to write on this title. Finally it is there today

మరువం ఉష said...

ప్రదీప్, అద్భుతం, శతకానికి సరైన అంశం. విరామం తర్వాత మీ కవిత చూస్తుంటే ఏదో ఆనందం. మీ కవిత మీద ప్రతి కవిత వ్రాసే శక్తి నాకు లేదు. "అనంతవృత్తం" నాకు జీవితంలో అలసట కలిగించే యాత్ర, ఇంకా పయనించాలని ఆసక్తి కలిగించేదీను. కాస్త కుతూహలం, కాస్త నిస్పృహ, పునరావృతాలు, అయినా అణగారని ఆశ హృదయ లయలో ప్రతిఫలించే దీప కళికలు నా మార్గ నిర్దేశాలు.

Unknown said...

ఇదేమిటి, పొగడ్తలా ఉంది.నా కవిత మీద ప్రతి కవిత ఏల, మీరు రాసిన పరాధీనరేఖనే ప్రతి కవిత అనుకుందాం.
నిజమే, ప్రతి జీవితానికి ఆశా జ్యోతులు ఆ దీపకళికలు
దీప కళికను చేరడమే మోక్షమేమో

విరామం నేను తీసుకోలేదు, తీసుకునేలా చేస్తున్నాయి ఇక్కడి నా ఆఫీసు పనులు. :(
ఇక శతకం, ఇది శతక టపా మాత్రమే లెండి... long way to go

కొసమెరుపు: అనంత వృత్తం మీద మరో హరివిల్లులాంటిది ప్రయత్నిద్దామా??

Dileep M said...

i'll come back

మరువం ఉష said...

పొగడ్త కాదు, సాయంత్రపు నిర్మలీకరణ ధ్యానసమయాన చూసినపుడు కలిగిన భావన అది.
కొసమెరుపు: నేను మునుపటికన్నా వృత్తిపర, వృత్తీతర పనుల్లో కాస్త సమయాభావ రక్కసి చేత చిక్కాను. కానీ తప్పక ప్రయత్నిస్తాను. ఇప్పటికి ఈ స్వగత విలాపం హెచ్చి ఏకాకిగా నీరుగారాను, ఓసారి చదివి వెళ్ళండి, వ్యాఖ్యకి సమయం వద్దు.

మరువం ఉష said...

Chitta Prasad gaaru posts very detailed and rare the most valuabble info along the lines of I, ego, triguNa, god at his blog http://plaintruthsfromprasad.blogspot.com/ I visit it on sporadic basis. I thought you might want to take a look too.

Unknown said...

dileep- come back soon

ఉష గారు,
మీరు ప్రయత్నిస్తారని తెలుసు... మీ కవితను చదువుతాను కాసేపటిలో. నా భావన అక్కడ వ్యాఖ్యగా ఉంటుంది.
ప్రసాద్ గారి బ్లాగు చదువుతాను.

durgeswara said...

ఏమి విధివైపరీత్యం
మా అర్జునుడు గాండివాన్ని ఎక్కడో దాచి , కవితలనే కళల రూపంవెనుక అజ్ఞాతవాసం చేస్తున్నాడు.మహాభార్తయుద్ధ సమీకరణలు జరుగుతున్నా మౌనం వహించాడేలనో ?

వేగుపంపండి ఒకసారి
durgeswara@gmail.com

Unknown said...

దుర్గేశ్వర వారు,
గాండీవం దాగలేదు, ప్రస్థుతానికి సమ్మోహనాస్త్రాలు వస్తున్నాయి. మీరు ఆశించేది నాగాస్త్రమా..తిరుగులేని బ్రహ్మాస్త్రమా.
మెయిలు కాసేపటిలో పంపుతాను