వసంతమా... మన్మథ మాసమా....

సన్నగా గాలి వీస్తోంది
బాల్కనీలోని మల్లెతీగను తడిమింది
తడిమి, ఒక మల్లెమొగ్గను తుంపింది
తుంపి, ఆ మల్లెమొగ్గలోని పరిమళాన్ని తనతో మోసుకెళ్ళింది
ఏ ప్రియుడు పంపాడో ఆ మల్లెమొగ్గల పరిమళంతో తన సందేశాన్ని తన ప్రేయసికి

కాసేపటికి గాలి స్థంభించింది, వాతావరణం వేడెక్కసాగింది
ఆ ప్రేయసి తన విరహ తాపాన్ని ఇలా చూపిందేమో
ఇంతలో ఒక పిచ్చుక ఎగిరింది ఒక మూల నుంచి మరో మూలకు
ఆమె మాటలాడిందేమో అతనితో
ఎక్కడి నుంచో వచ్చాయి నల్ల మబ్బులు
ఆమె కళ్ళ నుంచి జారే కన్నీళ్ళ జలపాతంలా వర్షించాయి

క్షణ కాలమే ఆ విరహవేదన భాష్పాలు
ఇంతలో మళ్ళీ గాలి వీచింది ఈ సారి మరింత బలంగా
తనతో మరింత పరిమళాన్ని మోసుకెళ్ళింది
దూరంగా రెండు మబ్బులు ముద్దాడుకుంటున్నాయి

ప్రేయసి ప్రియుల కలయికకు ఇలా సహకరిస్తున్న వసంతమా.. నీవు మన్మథమాసానివా?

(బాల్కనీ వైపు చూస్తూ కూర్చున్నప్పుడు నా ముందు జారి పడిన పువ్వుల సాక్షిగా)

7 comments:

పరిమళం said...

కళ్ళముందు ప్రకృతి ఆవిష్కరించిన అందమైన దృశ్యం సాక్షిగా కవిత జాలువారిందన్నమాట !

నేస్తం said...

wow ..chaalaa baagundi andi

మనోహర్ చెనికల said...

well weritten

Unknown said...

@పరిమళం గారు,
అవునండీ, ప్రకృతిని చూస్తుంటే యాధృచ్చికంగా వచ్చిన ఆలోచనే ఇది
@నేస్తం,మనోహర్
ధన్యవాదములు

మరువం ఉష said...

గాలే ప్రియుడేమో, విరహాన వేగుతున్నాడేమో
వానకన్నియను క్రిందకి దింపను
అలా పరిమళాల లేఖలంపాడేమో
పావురం లేదని పిచ్చుక రాయబారమంపాడేమో

మా పెరట్లో రోజూ ఉదయం ఇటువంటి వలపు సయ్యాటలెన్నిటినో గమనిస్తున్నా. నిజంగా వసంతుడు సమవర్తి. ప్రకృతంతా ఒకటే భావన నింపుతున్నాడు.

Julie (1975), My Heart Is Beating Song విన్నారా?

శృంగారం అన్నది సున్నితమని మీరు అనుకుంటే ఈ భావాలు అంతే బాగా అర్థం అవుతాయి.

Spring Is The Season
That Drops The Reason Of Lovers Who Are Truly True
Young Birds Are Mating
While I Am Waiting, Waiting For You
Darling You Haunt Me, Say Do You Want Me
And If It Is So, When Are We Meeting
Cause Love You Know
That Time Is Fleeting, Time Is Fleeting
Time Is Fleeting
My Heart Is Beating, Keeps On Repeating
I'm Waiting For You
My Love Encloses A Plot Of Roses
And When Shall Be Then Our Next Meeting
Cause Love You Know
That Time Is Fleeting, Time Is Fleeting
Time Is Fleeting

మరువం ఉష said...

Forgot to add these pics. These just add to what I said above ...

http://teluguvala.ning.com/photo/photo/listForContributor?screenName=30cfmn8791wvx

Unknown said...

ఉష గారు,
మీ ఊహ కూడా భలే ఉంది. ప్రియుడు గాలి, ప్రియురాలు వానకన్నియ.
ఇప్పుడే మీరు చెప్పిన పాటను చూసి విన్నా. పాట చిత్రీకరణ, పాట ట్యూను భలే ఉన్నాయి. మంచి పాటను పరిచయం చేసారు.
శృంగారం సున్నితమనే నా భావం.
మీరిచ్చిన ఫోటోలు, మీరు ఇదివరలో వాటి గురించి కవిత రాసినప్పుడు చూసాను. ఫోటోలు బాగున్నాయి.