నేను

విశ్వమంత శూన్యం నేను
ఉరుమంత నిశ్శబ్దం నేను

శిఖరమంత లోయ నేను
జీమూతమంత ఎడారి నేను

గుంపులో ఒంటరి నేను
కచేరీలో నిశ్వాస నేను

శ్మశానంలో జీవాన్ని నేను
జీవంలో మాయను నేను

విశ్వం కొలిచే కాలం నేను
ప్రాణం ఆపే క్షణం నేను

దుఃఖంలో ఆనందం నేను
స్వర్గంలో నరకం నేను

పండుగా రాలే మొగ్గను నేనే
చినుకుగా దూకే కరువుని నేనే

భిన్న ధృవాల జోడుని నేను
ఏక ధృవపు రాజుని నేను


No comments: