యుగాంతపు ప్రళయ కడలిపై వటపత్రమై తేలేందుకు
రుద్రతాండవ పదఘట్టనల్లో రేణువై మేరిసేందుకు
బ్రహ్మకపాలమాలలో తీగనై ఒదిగేందుకు
ఆదిశక్తి హుంకారపు ప్రణవధ్వనుల్లో లీనమయ్యేందుకు
అనుక్షణం మరణాన్ని ఆహ్వానిస్తూ
పరంజ్యోతి కాంతిలో పునీతమవుతూ
ఆ కాంతిలో పునర్జన్మిస్తున్నాను
అనంతమైన జన్మలు, చివరకు
ప్రళయాగ్ని కీలల్లో సమిధనై వెలిగేందుకు
మాయ కమ్మని జగతిలో ఆత్మనై జీవించేందుకు
రుద్రతాండవ పదఘట్టనల్లో రేణువై మేరిసేందుకు
బ్రహ్మకపాలమాలలో తీగనై ఒదిగేందుకు
ఆదిశక్తి హుంకారపు ప్రణవధ్వనుల్లో లీనమయ్యేందుకు
అనుక్షణం మరణాన్ని ఆహ్వానిస్తూ
పరంజ్యోతి కాంతిలో పునీతమవుతూ
ఆ కాంతిలో పునర్జన్మిస్తున్నాను
అనంతమైన జన్మలు, చివరకు
ప్రళయాగ్ని కీలల్లో సమిధనై వెలిగేందుకు
మాయ కమ్మని జగతిలో ఆత్మనై జీవించేందుకు
4 comments:
నిజం.అటువంటి రోజు వచ్చినపుడు జన్మ ధన్యం.
బాగుంది.
చాలా బాగుందండి !
యుగాంతపు ప్రళయ కడలిపై వటపత్రమై తేలేందుకు !
దైనిక జీవన సాగరం లో వటపత్రమై తేల గలిగితే ఎట్లా ఉంటుందో అని ఆలోచిస్తున్నా !
చీర్స్
జిలేబి
Nice this line is too good. . 'maaya kammani jagathilo aathmanai jeevinchenduku '
Post a Comment