నిర్వేదము

బాధా రాహిత్యపు బంధమై
ఆనంద రాహిత్యపు అంచులలో
నా మది పాడిందొక వేదం
ఆ వేదానికి నిర్వేదమని పేరు

నిర్వేదపు గీతానికి నిరాశ నెచ్చెలి అట
ఆశ శత్రువట,

ఇదేమి, నేను నిర్వేదానికి శత్రువుని కదా
అజాతశత్రువు ఆశ నా సేనాధిపతి
అయిననూ నిర్వేదపు గీతానికి తైతక్కలేల

అంతలో నవ్వెను నా చెలి “ ఏకాగ్రచిత్తము “
అంత కనిపించె సత్యము
నే పాడుతున్నది నిర్వేదపు గీతము కాదు
అది ఆశయ గీతమే, ఆ గీతమున తగ్గినది నా చెలి గొంతే

నేనున్నది బాధ చేరని, ఆనందము కదిలించలేని ఆశయ సాధనలో
నా చెలి చెంతనుండ పొందలేనిదేమి

4 comments:

భాస్కర రామిరెడ్డి said...

చెలి రేపిన ఆశయ గీతికతో,మది నిర్వేదిక గా మారకముందే ...

శీఘ్రమేవ "ఏకాగ్రచిత్త" ప్రాప్తిరస్తు :)

ఆత్రేయ కొండూరు said...

ప్రదీప్ గారు.. మీ భావాలు బాగున్నాయి. మీరు వాక్యనిర్మాణం, ఒకే తరహాగా ఉండే పదాల ప్రయోగాల మీద మరి కాస్త జాగర్త తీసుకుంటే ఇంకా బాగా రాయ గలరు. గమనించండి. బాగుంది అని వదిలేయడం కంటే ఇలా ఓసలహా కూడా ఇస్తే మీకు ఉపయోగ పడుతుందని.. ఉచితమేగా.. అన్యధా అనుకోకండి.

పరిమళం said...

మొదటిపేరా చాలా బావుంది
తర్వాత కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించింది

Unknown said...

@భాస్కర్ గారు,
నా చెలే ఏకాగ్రచిత్తమని చిత్తగించితిని. మది నిర్వేదిక కాదు లెండి ఆ చెలి తోడుండ
@ఆత్రేయ గారు,
మీ సలహాకు ధన్యవాదాలు. చాలా మంది ఈ మధ్య ఇదే చెప్పారు. ప్రయత్నిస్తున్నాను దాన్ని దాటడానికి. విమర్శకులు లేనిచో కవి కాడు ఎవడూ ఉలి దెబ్బ లేనిదే శిల శిల్పమవునా
@పరిమళం గారు,
నేను మొదటి పేరా రాసాక కన్ఫ్యూజ్ అయ్యానని మీకెలా తెలిసిపోయిందబ్బా???