సాఫ్టువేరింజనీరు -- మరో కవిత


వాన పడిందో లేదో తెలియదు
ఎండల మంటతో సంబంధమే లేదు
చలి పులి భయమే లేదు
ఎప్పుడు నిద్ర పోతాడో తెలియనే లేదు
పొలంలో నాటిన విత్తు మొలిచిందో లేదో తెలియదు
మనసు విప్పి చివరి సారి ఎప్పుడు " నోరారా " మాట్లాడాడో తెలియదు

తనకు తెలిసిందొకటే
బుల్లిదో పెద్దదో ఏదో ఒకటి ఆ రంగుల తెరవేపే చూడడం
ఒక చేతిని ఎప్పుడూ నేలకు సమాంతరంగా 180 డిగ్రీల కోణంలో తిప్పడం
ఇక మరో చెయ్యి ఎప్పుడూ మీటలు నొక్కడం
ఇన్ని అవలక్షణాలున్నా
అతను విశ్వ విజేత ...
మరో సృష్టికి రాళ్ళెత్తుతున్న కూలీ ... టెక్నికల్ కూలీ

(బ్రహ్మచారి సాఫ్టువేరింజినీరు గురించి మాత్రమే సుమా..... )
బ్రహ్మచారులకు మాత్రమే అన్నది చదివిన ఒక స్నేహితుడు వివాహితుల పరిస్థితి కూడా ఇదే నాయనా అనడంతో ఆ లైనులను కొట్టివేయడం జరిగినది.

రెహ్మాన్ కు శుభాకాంక్షలు


రెహ్మాన్ నుంచి వచ్చిన ఉత్తమ సంగీతం కాదు. కానీ ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టిన సంగీతం.
ఒకేవ్యక్తి రెండు ఆస్కారులు ఒకేసారి గెలవడం కూడా రికార్డేమో చూడాలి...
ఈసారి ఆస్కార్ వేడుకలలో మొత్తం ముగ్గురు భారతీయులు అవార్డందుకోవడం విశేషం
స్లమ్ డాగ్ మిలీయనర్ పై నా వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నా, 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.