ఎవరామె?


గదిలోపల నేను గది బయట ఆమె
నాకు తెలుసు తను నాకోసమే వచ్చిందని,
కానీ ఎందుకో గుమ్మం బయటే ఆగింది
ఈ సారైనా నేనే తనని పలకరిస్తానన్న ఆశేమో  

నాకు ఆమెను పలకరించాలని ఉన్నా  
మనసులో ఎక్కడో వద్దనే అనిపిస్తోంది

నాకు
తనంటే కోపమా   ? ఏమో, తను కనిపిస్తే సర్వం మరచి గాలిలో తేలతాననేమో
తనంటే భయమా   ? ఏమో ఈ సమాజం దృష్టిలో ఇక నేనుండననే భయమేమో  
తనంటే అభిమానమా   ? ఏమో, నా కష్టాలన్నీ దూరం చేస్తుందనేమో

మాది జన్మ జన్మల అనుభందమైనా
ఆమెతో నాకెప్పుడూ తొలి పరిచయమే

ఎవరామె, నా అర్ధాంగి కాదు
నా ప్రేయసి కాదు  
ఆమె లేకుండా నా జీవితం పూర్తి కాదు
ఎవరామె   ?

(చావుకు దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి మాటలలో మృత్యుదేవతను వర్ణించే ప్రయత్నం)

22 comments:

మధురవాణి said...

నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు..!
మీకు అభినందనలు.

ఆత్రేయ కొండూరు said...

చాలా బాగా చెప్పారు ఫణి గారు
అభినందనలు.

నేస్తం said...

చాలా బాగుంది .. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం :)

లక్ష్మి said...

Pch!!! manasu lotulani tatti lepina bhavana... bagundi

నాగప్రసాద్ said...

చాలా బాగుంది.

సుభద్ర said...

chitakottesaru.
inka elane manchi manchi kavitalu raayali.
i wish u allthe best.
by the way mee tag(argundi banali ki)kudaa
chala chala bagundi

Unknown said...

@మధురవాణి, ఆత్రేయ, నేస్తం , లక్ష్మి , నాగ ప్రసాద్
కృతజ్ఞతలు
@సుభద్ర
కృతజ్ఞతలు. తప్పకుండా ప్రయత్నిస్తాను. నా ప్రస్తుత టాగ్ లైను ఇది వరకు ఈ బ్లాగు టైటిలుగా పెట్టాను. కానీ మరీ పెద్దదిగా ఉందని దాన్ని పూర్తిగా తీసేయలేక అలా తోకలా పెట్టాను.

మరువం ఉష said...

అంతే కాదు నాకు తెలుసు ఆమె నగుమోము నేనెన్నడూ కానలేదని,
ఎందుకంటే నే తలుపు తెరిచిన క్షణమే నాకిక ఇహం మిగలదనీ,
పరం, ఐహికం తను చూపిస్తదనీ గుడ్డిగా తన వెంటపడిపోతాననీ,
ఆపై ఈ జరా మరణ భ్రమణంలో దారితప్పి తిరిగి మరో తనువు తొడుక్కుని తనను వెదుకుతూ మరలి వస్తాననీనూ.
"స్పందన తీవ్రమైనప్పుడు ఇలా కవితగా వెల్లువౌతుంది, మీ భావనని ఇది పలుచన చేయదనే నమ్మకం. అలాగే ఈ వ్యాఖ్యని తొలగించే సర్వ హక్కులూ మీవే!" - ఉష

Unknown said...

నేను సగమే రాస్తే దాన్ని మీరు పూర్తి చేసారు. మీ స్పందనను ఆస్వాదించే రసజ్నుడినే వ్యాఖ్యను తొలగించే సంకుచిత మనస్తత్వం ఉన్నవాడిని కాను. మీ స్పందనకు నా కృతజ్నతలు

PAVANKALYAN[I.A.S] said...

ఎవరామె, నా అర్ధాంగి కాదు నా ప్రేయసి కాదు ఆమె లేకుండా నా జీవితం పూర్తి కాదు ఎవరామె ?
చావుకు దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి మాటలలో మృత్యుదేవతను వర్ణించే ప్రయత్నం

బ్రదర్ మీ కవితలు బావున్నాయి మీరు నన్ను పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ కలిపి ఒక కథ రాస్తున్నారా అని అడిగారు మీ సందేహానికి నా జవాబు మీరు పవన్ కళ్యాణ్ ఎ ఒక్క సినిమాలో అయినా ఇలాంటి కథ మీరు చూచారా ?

బ్రదర్ ఈ స్టొరీ నా ఊహలు లో నుంచి పుట్టు కొచ్చిన ఒక ప్రయేగం ఈ స్టొరీ మన దేశం లో జరిగిన కొన్ని సంగటనలకు ప్రతి రూపం డైలీ మీరు చదివితే మీకే అర్ధం అవుతుంది మీరు మంచి కవితలు రాయాలి అని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్

PAVANKALYAN[I.A.S] said...

బ్రదర్ ప్రదీప్ పాత సినిమాలో లా వుంది అన్నారు ఒకే కాని నా బ్లాగ్ ని రోజు అబ్జర్ చేయండి కోత దనం కనిపిస్తా ధో లేదో మీరే కొన్ని రోజులు తరువాత విషయం చెబుతారు మీ సందేశాన్ని నాకు తెలిపినందుకు అబినధనలు బ్లాగ్ లో మీరు ఒక మంచి ప్రెండ్ గా నాకు మంచి విషయాలు తెలుపుతున్నారు థ్యాంక్ యు వెరీ మచ్చ్

Anonymous said...

మీరు తవికల్లొ పొడుపు కధలు భలే వ్రాస్తున్నారే?

సూర్యుడు said...

బాగుంది :)

Unknown said...

@ఎనానిమస్ గారు, సూర్యుడు గారు
ధన్యవాదములు

Vinay Chakravarthi.Gogineni said...

ఎవరామె, నా అర్ధాంగి కాదు
నా ప్రేయసి కాదు
ఆమె లేకుండా నా జీవితం పూర్తి కాదు
ఎవరామె ?

ee prayogam baagundi..especially aame lekunda naajeevitam poortikadu

Unknown said...

వినయ్ ,
నా చిన్ని ప్రయోగం నచ్చినందుకు ధన్యవాదములు

, said...

బావుందండి! యండమూరి అంతర్ముఖం గుర్తుకొచ్చింది.
మృత్యుగీతాలపై ఈ క్రింది లంకె లో మచ్చుకు కొన్ని చూడండి

http://sridharchandupatla.blogspot.com/search/label/%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%97%E0%B1%80%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81

Unknown said...

@ఇండియన్ గారు,
నేను రాసిన చిన్న కవితకు మీకు యండమూరి వారి నవల గుర్తుకొచ్చిందంటే అది నా కవితకు వచ్చిన అత్యుత్తమ కాంప్లిమెంట్ గా పరిగణిస్తాను. మీరు రాసిన మృత్యుగీతాలను చదువుతున్నాను. బాగున్నాయి.

Anonymous said...

టచ్ చేసారండి...నాకు మీ కవిత చూసిన తర్వాత, నా బడిలో నేను ఒకప్పుడు ఇష్టపడ్డ అమ్మాయి గుర్తుకు వచ్చింది. నేను ఇష్టపడడం మాత్రమే చేస్తున్నా, ఇంకేమి చేయలేకున్నా... సర్లే, ఇక్కడ నా గొడవ ఎందుకులేంది. ఇంతకు ఎవరామె???

Unknown said...

అయితే మీరు ఈ కవితలో రెండవ కోణాన్ని చూసారన్నమాట. మొదలయ్యేది అమ్మాయిని వర్ణిస్తూ అయినా అంతమయ్యేది అంతం లేని మృత్యుదేవతను చూపుతూ కదా.. ఆమె ఎవరో తెలిసిందనే అనుకుంటాను

Anonymous said...

అందమైన స్త్రీమూర్తులకు, మృత్యుదేవతకు పెద్ద తేడా లేదులెండి. ఇంది మా స్నేహితుల అనుభవాల నుండి నేను గ్రహించిన విషయం.

Unknown said...

ఏంటండీ అంత మాట అనేసారు!!!