కాలాన్ని జయించాలని ఉంది, నిన్ను కలిసే క్షణం కోసం.
కానీ ఈ కాలం ఉందే, ఇదో పెద్ద రక్కసి..
దీనికి ఒళ్ళంతా కళ్ళే, ప్రపంచమంతా సేవకులే.
నిన్ను కలిసే ఆ క్షణాన్ని త్వరగా చేరడం కోసం
రక్కసితో సమరం చేసా.. సమానం కాలేకపోయా..
మరోసారి దాని చేతిలో ఓడిపోయా..
నా శక్తి చాలదని, దేవుని కోసం తపస్సు చేసా...
కాలాన్ని జయించాలంటే కాలాతీతం కావాలన్నాడు.
కాలాతీతం కావాలంటే, కాలాతీతమైనదాన్ని చేజిక్కించుకోవలన్నాడు.
మన ప్రేమ కన్నా కాలాతీతమేముంది?
మన ప్రేమను గెలవాలంటే,
నా పిచ్చి కానీ ప్రేమకు గెలుపోటములేమిటి!
నా కలలో ఉన్న నిన్ను కలిసిన క్షణమే
మన ప్రేమ గెలుస్తుందన్నాడు దేవుడు.
నిన్ను కలిసే క్షణం కోసం కాలాన్ని జయించాలనుకున్నా
నిన్ను కలిస్తేనే కాలాన్ని జయిస్తానన్నది ఆ దేవుని ఆనతి.
నిన్ను కలిసే ఆ క్షణం వరకూ నువ్వుండే కలలోనే బతకమంటావా....
గమనిక: కాల రక్కసి అన్న పదం వ్యాకరణ పరంగా తప్పు అయినప్పటికీ ప్రాస కోసం వాడాను.
11 comments:
ei naa post malli chusukundaamante........
why did u remove it?
stupid.....
>> "ప్రేమకు గెలుపోటములేమిటి"
అది మాత్రం నిజం. ప్రేమికుల నడుమ కానీ, ప్రేమకీ విధికి మధ్యన కానీ, ప్రేమకీ కాలానికీ వున్న సంబంధంలో కానీ సంధి/శాంతి ఒప్పందం కుదురుతుంది. అదే ప్రేమలోని మహిమ. అలా కాని నాడు అది ప్రేమే కాదు, లౌకికంగా ఏర్పర్చుకున్న భావనౌతుంది. ప్రేమ మనసుకి సంబంధించింది, దానికి రాగద్వేషాలు అంటవు. గెలుపు, ఓటమి పట్టవు.
ఉషగారు,
నేను చెప్పాలనుకున్న అలౌకిక భావనను గ్రహించారు. ధన్యవాదాలు.
ప్రేమ గురించి నాకంత తెలియదు. కాని, మీ టపా చూస్తే ఎదో కాస్త తెలిసొచ్చిందని అనిపిస్తున్నది. ఇంతకు మీరు ఎవరినైనా ప్రేమించారా?
సాయి ప్రవీణ్ గారు,
ఒక్కసారి అంతెత్తు లేచి మళ్ళీ కిందకు పడ్డా... నిజమేనా నేను చదివినది, నా కవితతో ప్రేమ గురించి తెలిసినట్టు చదివిందా...
కవిత రాసిన ప్రతీ కవి ఆ భావాన్ని తన జీవితంలో అనుభవించనవసరం లేదు.
hmmmmm..... మీకు తోచినది మీరు వ్రాసినా, చదివే మాకు ఏమైనా తోచవచ్చును కదా!!!!
అయినా బలేవారండి మీరు, ఎవరైనా నచ్చలేదంటే బాధపడతారు, కాని నేను మనస్పూర్తిగా మీ భాషమీద పట్టును, మీ సృజనకు ముగ్ధుడునై మీ బ్లాగును, అందులోని టపాలు నచ్చాయి అని మెచ్చుకుంటే ఒప్పుకోరే?! బహుశా మీకు పొగడ్తలంటే నచ్చవేమో. కాని అందులో నిజాయితి ఉంటే మత్రం మీరు కచ్చితంగా స్వీకరించాలని మనవి.
సాయి ప్రవీణ్ గారు,
భాష మీద అంతగా పట్టు లేనివాడిని. పొగడ్తలు అత్తరు లాంటివని తెలుసుకున్నవాడిని. అందుకే వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. మీలో నిజాయితీ ఉందని నేనెప్పుడో గ్రహించాను.
అందుకోండి నా అతిధికి నేనందించే నీరాజనం
పొగడ్తలకు లొంగకపోవడం మంచిదే. నన్ను ఆదరించినందుకు ధన్యవాదములు.
Post a Comment