స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ... పాత జ్నాపకాలు

సుమారు పదిహేనేళ్ళ క్రితం, అంటే నేను బళ్ళో చదివేటప్పుడన్నమాట...
నిజంగా స్వతంత్రం అంటే ఏమిటో తెలియని వయసు, త్యాగం అనే మాటలోని ఆర్ద్రత తెలియని వయసు,
కులమతాల పట్టింపులు లేని స్వచ్చమైన వయసు. పోరాటమంటే ఏమిటొ తెలియని అమాయకత్వపు వయసు

అందరిలానే నాకు బడి అంటే ఒక రకమైన చిరాకు ఉండేది. కానీ బళ్ళో కూడా ఆడుకోవాలంటే కుదరదు కదా!!!
మరి ఎలా???
అదిగో అప్పుడు నాలాంటి వాళ్ళ కోసమే అన్నట్టు స్వతంత్ర దినం వచ్చింది, ఆగష్టు పదిహేను. బడి తెరిచిన అరవై రోజులకి.

ఎప్పుడూ లేనిది బళ్ళో ఆటల పోటీలన్నారు పాటలు పాడమన్నారు నృత్యం వస్తే నాట్యమాడమన్నారు. అలా పది రోజులు బడి కాస్తా ఆట స్థలమయ్యింది.
ఇక అప్పటి నుంచి స్వతంత్రం కోసం గాంధీ, సుభాష్ లాంటి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు అని పుస్తకాలు చదివి తెలుసుకోసాగాను.
కలిసి ఉంటే కలదు సుఖం అని నిరూపించిన 1857 చేదు జ్నాపకాల గురించి తెలుసుకున్నాను.
ఇలా ప్రతీ ఏడాదీ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవడం, ఆగష్టు పదిహేను ఇంటిలో పండగలా చేసుకోవడం అలవాటయ్యింది.
అలా కొన్నాళ్ళకు పైన చెప్పినవాటికి నిజమైన అర్ధాలు తెలిసాక, నాకు వచ్చిన సందేహాలు

  • మనకు స్వతంత్రం నిజంగానే వచ్చిందా?
  • స్వతంత్ర వీరుల త్యాగానికి నిజమైన విలువ ఇస్తున్నామా??
  • అవినీతి మన రక్తంలో భాగమా???