ఎన్ని జన్మలు ఎత్తానో లెక్క నాకు తెలీదు, నీకు
తెలుసు కదా ప్రభూ
ఆ లెక్క నాకొద్దు, నా జన్మజన్మల బాకీ ఎప్పుడు తీరుతుందో చెప్పవా

ఒకనాడు బురదలో పడవేసావు, పంకజమై నీ పూజకు వచ్చాను
మరొకనాడు అడవిలో చెట్టుని చేసావు, నీ గుడికి ధ్వజస్తంభమై వచ్చాను

రూపమేదైనా చేరేది నిన్నే
చీమనైతే శ్రమిస్తూ, వ్యాఘ్రమైతే అడవులలో వేటాడుతూ
మేఘమైతే వర్షిస్తూ, చేపనైతే నదములలో ఈదుతూ
నెమలినైతే నర్తిస్తూ, కోకిలనైతే మధురగానం చేస్తూ
నిన్ను చేరడానికి నాకు తెలిసిన భాషలో పూజిస్తూనే ఉంటాను

ఏ జాతిలో జన్మించినా ఆ జాతి ధర్మంతో నీ బాకీ
తీరుస్తూనే ఉంటా
No comments:
Post a Comment