బహుశా ఇది మాయో లేదా స్వప్నమే కావాలి
దిక్కులు ఏవో తెలియని లోకమది, సహస్రలోకాలు చుట్టూ చేరిన విశాలవిశ్వమది
చీకట్లు చేరని చిత్రమది, సహస్రాదిత్యుల వెలుతురు పరచిన లోకమది
శబ్దం చేధించని ప్రశాంతమది, సహస్ర ప్రణవ నిత్యసంగీత గానమది
ఎలా నేను ఇక్కడ నిలిచాను, అంతు పట్టని రహస్యమది
మరెందరో నాట్యాలు చేస్తున్నారు
మరెందరో గానాలు చేస్తున్నారు
ఏకకాలంలో సహస్రలీలలు, అన్నీ కొంగ్రొత్తవే
తెలియని జ్వాలలు ఎగసి పడుతున్నాయి,
కొన్ని జ్వాలలు నీలపు రంగుగా మారి అదృశ్యమవుతున్నాయి
ఇంకొన్ని జ్వాలలు ధవళకాంతులు జిమ్ముతున్నాయి
శక్తిసమూహంలో నేను భాగమై ఉన్నాను, ఎటు చూసినా శక్తిరూపాలు,
ఏదో తెలియని మోహంలో నేను మునిగిపోయాను
నా స్థితి వర్ణనాతీతము,
నా స్పర్శకు చిక్కని విచిత్రమై,
నా కళ్ళకు కనిపించని అనుభూతినై,
నా చెవులకు వినిపించని భాష్యమై నేనున్నాను
ఒక అనిర్విచనీయ ఆనందానుభూతిలో వటపత్రమై తేలుతున్నాను
నా గొంతు ప్రభో అని పిలిచింది,
అనంతరూపం అనంత గొంతుకులతో ప్రతిధ్వనించింది
English Version:
Perhaps it must be an illusion or a dream
It's a world with no directions, It's a endless galaxy bounding infinite worlds
It's a miracle with no darkness, It's a world filled with lights of infinite Suns
It's a unbreakable calmness, It's a eternal song of infinite tones
How did I came here, it's an unknown mystery
Many are dancing,
Many more are singing
Infinite plays at same time, everything is new
Unknown fires are erupting
Some are becoming blue and vanishing
Some are becoming white and glowing
I became part of an energy flow, every side filled with energy
I lost myself in some unknown lust
My state is indescribable,
I'm a miracle that can't be felt by touch
I'm a feeling that can't be seen by eyes
I'm a song that can't be listened by ears
I'm floating as a leaf in inexpressible feeling of happiness
My voice trembled "Oh God"
An infinite echoed with infinite voices