అస్థిత్వం

తలనిండా బరువెక్కిన అగ్గిపుల్ల,
తలను రాపాడిస్తూ పరిగెట్టింది
అగ్నిహోత్రుని సమిధగా మారి బూడిదగా మిగిలింది

నీటి కుండ నల్లమబ్బు,
కొండను డీకొట్టి ఉరిమింది
చినుకుగా కరిగి జలపాతంలో సమాధి అయ్యింది

గాలి నింపుకున్న బుడగ,
తేలితేలి నేల మీదకు దుమికింది
ఒళ్లంతా తూట్లు పడి వాయుతర్పణం అయ్యింది

చెట్టుకు దుప్పటి కప్పింది తొలి మంచు,
నిద్ర లేచి ఒక్కసారి ఒళ్లంతా విచ్చుకుంది చెట్టు
జారిపడి ఆకసంలో తేలిపోయింది

మట్టి ముద్ద మనిషి,
ధిక్కారపు స్వరం చేస్తూ పైపైకి ఎగిరాడు
నేల వెతుక్కుని మట్టిలో కలిసాడు 

3 comments:

మరువం ఉష said...

beautiful Arjun! పాంచభౌతిక తత్త్వాలతో 'చివరకు మిగిలేది' నిక్కచ్చిగా చెప్పేసిందీ కవిత.

ప్రేరణ... said...

చివరికి మట్టిలో కలిసే మనకెందుకింత తాపత్రయం!

Dileep.M said...

BaaguMdi