అనంతమైన జన్మలు

యుగాంతపు ప్రళయ కడలిపై  వటపత్రమై తేలేందుకు
రుద్రతాండవ పదఘట్టనల్లో రేణువై మేరిసేందుకు
బ్రహ్మకపాలమాలలో  తీగనై ఒదిగేందుకు
ఆదిశక్తి హుంకారపు ప్రణవధ్వనుల్లో లీనమయ్యేందుకు

అనుక్షణం మరణాన్ని ఆహ్వానిస్తూ
పరంజ్యోతి కాంతిలో పునీతమవుతూ
ఆ కాంతిలో పునర్జన్మిస్తున్నాను

అనంతమైన జన్మలు, చివరకు
ప్రళయాగ్ని కీలల్లో  సమిధనై వెలిగేందుకు
మాయ కమ్మని  జగతిలో ఆత్మనై జీవించేందుకు

4 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

నిజం.అటువంటి రోజు వచ్చినపుడు జన్మ ధన్యం.

Dileep.M said...

బాగుంది.

Zilebi said...


చాలా బాగుందండి !

యుగాంతపు ప్రళయ కడలిపై వటపత్రమై తేలేందుకు !

దైనిక జీవన సాగరం లో వటపత్రమై తేల గలిగితే ఎట్లా ఉంటుందో అని ఆలోచిస్తున్నా !
చీర్స్
జిలేబి

Siri said...

Nice this line is too good. . 'maaya kammani jagathilo aathmanai jeevinchenduku '