అమ్మ లాలిపాడుతుంటే, వెన్నెల ఊయల ఊపే చెలికాడు మత్తులో జోగిన వేళ
వెన్నెల జిలుగుల శశి, శిశువై నిదురోయిన వేళ
అమావాస్య అమాయకంగా ఉంది
వెన్నెల జిలుగుల శశి, శిశువై నిదురోయిన వేళ
అమావాస్య అమాయకంగా ఉంది
చీకటి ముసిరి, అసుర
కాంక్షలు చెలరేగిన వేళ
నిశి అంతమెప్పుడో తెలియక బిక్కుబిక్కుమనే వేళ
అమావాస్య భయానకంగా ఉంది
నిశి అంతమెప్పుడో తెలియక బిక్కుబిక్కుమనే వేళ
అమావాస్య భయానకంగా ఉంది
వినీలజగత్తుపై చీకటి దుప్పటి కప్పిన వేళ
మిణుగురుల కాంతి మాహాజ్యోతిలా పేట్రేగిన వేళ
అమావాస్య అజ్ఞానపు బావుటాలా ఉంది
మిణుగురుల కాంతి మాహాజ్యోతిలా పేట్రేగిన వేళ
అమావాస్య అజ్ఞానపు బావుటాలా ఉంది
శ్రావణమేఘాలు కమ్మిన నిశివేళ
మెరుపులు నాట్యం చేస్తుంటే, ఉరుములు తాళం వేస్తూ జాగారం చేసినవేళ
అమావాస్య సృష్టిని సృజన చేస్తున్నట్టు ఉంది
మెరుపులు నాట్యం చేస్తుంటే, ఉరుములు తాళం వేస్తూ జాగారం చేసినవేళ
అమావాస్య సృష్టిని సృజన చేస్తున్నట్టు ఉంది
పాలసంద్రపు నురగలపై మెరిసిన సోముడు, పార్వతి కనుచూపుకి బెదిరి హరుని జటాఝూటంలో దాగిన వేళ
తారల మది దోచిన వెన్నెలరేడు, దక్షుని హుంకారానికి జడిసి శివతపం చేసిన వేళ
అమావాస్య పాపనాశనిలా ఉంది
తారల మది దోచిన వెన్నెలరేడు, దక్షుని హుంకారానికి జడిసి శివతపం చేసిన వేళ
అమావాస్య పాపనాశనిలా ఉంది
బాహ్య ప్రపంచపు గాఢాంధకారం అల్లుకున్న వేళ
నిర్మలజ్యోతి నిరాకారమై, శివమై ఉద్భవించిన వేళ
అమావాస్య అందంగా కూడా ఉంది
నిర్మలజ్యోతి నిరాకారమై, శివమై ఉద్భవించిన వేళ
అమావాస్య అందంగా కూడా ఉంది
No comments:
Post a Comment