తెల్లతెల్లవారె
సూరీడా
ఎర్రని కోకలు తెచ్చేసి సక్కంగ భూమంత పరిచేసి
రంగురంగుల పూలెన్నో జతచేసి కొప్పున తురిమేసి
పన్నీరు జల్లుల్ని నేలంతా జల్లేసి
మత్తు గాలికి మత్తెట్టి జోకెట్టి లోకమునెల్ల నిదుర లేపేస్తివా,
నిన్నెవరు లేపితిరి సూరీడా
ఎర్రని కోకలు తెచ్చేసి సక్కంగ భూమంత పరిచేసి
రంగురంగుల పూలెన్నో జతచేసి కొప్పున తురిమేసి
పన్నీరు జల్లుల్ని నేలంతా జల్లేసి
మత్తు గాలికి మత్తెట్టి జోకెట్టి లోకమునెల్ల నిదుర లేపేస్తివా,
నిన్నెవరు లేపితిరి సూరీడా
రోజంతా
నిప్పుల్ని రాజేసి అలసితివా సూరీడా
అదిగో చంద్రుడొచ్చినాడు,
సలసల్లని గాలులు సలసలవేగే నీపై జల్లేసి
నీకేమో జోలపాడి
తెల్లతెల్లని కోకలు భూమంత పరిచేసి
కొప్పున పెట్టిన పూలన్నీ నేల రాల్చి
మత్తు తెమ్మెరలెన్నో భూమంత రాజేసి
గమ్మత్తు చేసాడు సూరీడా
మళ్ళా పొద్దున్నే వచ్చేయి సూరీడా
అదిగో చంద్రుడొచ్చినాడు,
సలసల్లని గాలులు సలసలవేగే నీపై జల్లేసి
నీకేమో జోలపాడి
తెల్లతెల్లని కోకలు భూమంత పరిచేసి
కొప్పున పెట్టిన పూలన్నీ నేల రాల్చి
మత్తు తెమ్మెరలెన్నో భూమంత రాజేసి
గమ్మత్తు చేసాడు సూరీడా
మళ్ళా పొద్దున్నే వచ్చేయి సూరీడా
No comments:
Post a Comment