చేతి గీతలు నా భవిష్యత్తు చెప్తాయన్నారెవరో 
హస్త రేఖలు బాగుంటే పట్టినదంతా బంగారమన్నారు మరెవరో 
ఏమో అది నిజమో కాదో నాకు తెలీదు 
నిజమేనా అని దేవుడినే అడిగా, చెప్పాడు అవి ఏమిటో 
వెంటనే పరిగెత్తికెళ్లి అమ్మనడిగా నిజమేనా అని ? 
అమ్మ నవ్వి తన చేతిలో రేఖలు చూపించింది. 
దేవుడేమి చెప్పాడని జాతకనిపుణులు అడిగారు
నేను బిందువుగా అమ్మ కడుపులో చేరి
దాన్నించి ఎప్పుడు బయటకొద్దామా అని 
కడుపు బంధిఖానా అనుకుని  తన్నేవాడినట 
తన్నిన ప్రతిసారీ దేవుడు నా అరచేతి మీద కొట్టేవాడట 
ఆ దెబ్బలే ఇప్పుడు రేఖలుగా మిగిలాయట 
బిందువై మొదలై బాంధవ్యాలు పెంచుకుని
అవి తిరిగి తెంచుకుని బూడిదిలా మారే వరకు
ఆ తొమ్మిది నెలలను గుర్తు పెట్టుకోమని ఇచ్చిన చేతి గీతలట
అవునేరీ ఆ జాతక నిపుణులు? బహుశా అమ్మ దగ్గరికెళ్ళారేమో?
 
 
2 comments:
బాగుంది........
చేతిరేఖలు అమ్మ కడుపులో మనం చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలకు మిగిలిన ఏకైక గుర్తులు....
చేతి రేఖలు అమ్మ కడుపులో తయారౌతాయి. నిజమే కొన్ని సంస్కారాలు గర్భంలో ఉన్నప్పుడే అంటుకుంటాయి. అమ్మ ఏం తింటుందో , ఏం వింటుందో దాన్ని బట్టి. అంటే మనరాత కొంచెం మనం పూర్వ జన్మ నుండి తెచ్చుకుంటే, కొంత అమ్మానాన్నలిస్తారన్నమాట. ఆ అమ్మానాన్నలని కూడా ఆ భగవంతుడు మనకు తగ్గవాళ్ళనే ఇస్తాడు.
Chaalaa bavundi, puttukanu gurtu pettukovadame bhavishyattu ki punaadi ani enta andam gaa chepparu. Adbhutam.
Post a Comment