ఏమి భావమో ఇది

ఆనందభాష్పాలు కావు
వేదనరోదనలా !కాదు
ఆనందానికి వేదనకూ నడుమ ఏమిటిది? శూన్యమా??‌

ఎగిసే అల కాదు
కరిగే కల కాదు
అలా ఎగిసి అంతలోనే కరిగి , తెలియని భావమిది!

ప్రపంచపు ఉనికి తెలియలేదు
వేసే అడుగు తడబడలేదు
ఆకసంలో‌ తేలుతూ నేలపై నడుస్తూ , ఏమి స్థితి ఇది?

విజయము కాదు
అపజయమూ కాదు
గెలుపుకూ ఓటమికీ నడుమ, కోరికలేని క్షణమా ఇది

అనిర్వచనీయమీ అనుభూతి
క్షణకాలమైనా అనంతంలా నిలిచే ఆకృతి ఇది
శూన్యంలా గోచరిస్తూ అనంతంలా హృదయంలో నిలిచిన భావమిది

4 comments:

durgeswara said...

chaala rojulataruvaata choostunnaamu ajunudi sarasamdhaanam

కెక్యూబ్ వర్మ said...

విజయము కాదు
అపజయమూ కాదు
గెలుపుకూ ఓటమికీ నడుమ, కోరికలేని క్షణమా ఇది

baagumdi. ee stabdhatanu baddalukottE vijayanaadam mOgaalani kOrukuntu..

మరువం ఉష said...

చివరికి మీరే తేల్చేసుకున్నారుగా.. శూన్యం కాదు పూర్ణం అని.. మీరన్న ఆ కోరిక లేని నిశ్చలస్థితి దొరికితే అదేగా ముక్తి/మోక్షం.. ఇది నా పరిమితస్థాయి కి తోచిన భావన.

Unknown said...

durgEswara,
చాలా రోజుల తరువాత దర్శనమిచ్చారు.
కెక్యూబ్ వర్మ గారు,
మోగుతుంది విజయనాదం. అది సింహనాదం, తొలి అడుగుకు స్వాగతం‌పలికే‌ శంఖారావం.
ఉష గారు,
నా కన్నా ముందు మీరే తేల్చేసారు అది పూర్ణమని. ఆ నిశ్చల స్థితి అనునిత్యం‌తోడుండాలి.
"ఇది నా పరిమితస్థాయి కి తోచిన భావన." - అవసరమా మీరు ఇలా అనడం, అనుకోవడం