వీరుడెవ్వడు మరుభూమిలో. ధీరుడెవ్వడు అమ్మఒడిలో
రక్తాక్షర కవితలా వీరత్వ గాధలుమృత్యు గాన హేలా ధీరత్వ విజయగీతికలు
రక్తం చిందని వీరత్వం , ప్రశ్నార్ధకమన్నది నేనెరిగిన చరిత్ర
మృత్యువుతో ముద్దులాడని ధీరత్వపు ధ్యేయమేమని ప్రశ్నించింది చరిత
గర్వము కానరాని ఆత్మదర్శనము, అహం ఎరుగని కుతూహలపు చూపు
తామస బంధనమే గదా దాగిన గర్వం
అహం బ్రహ్మస్మి , అన్యం శూన్యోస్మి!
గర్వమెరుగని మనసు, కధాబంధనమన్నది నేటి చరిత
అహం బ్రహ్మస్మి , " అన్యం పరబ్రహ్మోస్మి ", మరో కధలో పాత్రేనా ఇది
చిత్తమునెరుగునా చివరి కౌగిలింత, చిత్తము తెలుయునా తొలి కేరింత
చిత్తబంధన జీవితం ,
చిత్తశోధనం ఈ పయనం
చిత్తమే బందీయా, ఎవరా కావ్యపురుషుడు
చిత్తము శూన్యమా, ఎచట ఆ యోగీశ్వరుడు
తొలి అడుగు వేసిన క్షణమే మొదలు ఆ చివరి మజిలీకి పయనం
నడుమ చేసే మజిలీల లెక్కలెన్నైనా లెక్క లేదు ఆ చివరి స్నేహానికి
ఆత్మ మజిలీలెన్నైతేనేమి,ఈ తొలి అడుగులో పసితనపు ఛాయలే కదా
6 comments:
>> ధీరుడెవ్వడు అమ్మఒడిలో
అమ్మ గొప్పదనాన్ని అన్యాపదేశంగా తెలిపారు. శభాష్
చాలా గొప్ప భావం నింపిన ఈ కవితకి నేను వ్రాసే వ్యాఖ్య దిష్టిచుక్క మాత్రమే.
>> తొలి అడుగులో పసితనపు ఛాయలే కదా
అవతారమూర్తైనా అణూవంతే పుడతాడుగా మరి. తొలి అడుగు జీవితసాధనకి అంకురారపణే మరి!
మహా శివరాత్రి శుభాకాంక్షలు ! మంచి విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు .
ఓహ్ ....అద్భుతంగా ఉంది మాటల్లో చెప్పలేనండీ ముఖ్యంగా మొదటిలైను ...చివరి రెండు పేరాలు చాలా చాలా బాగా రాశారు ...ఉష గారే అలా అంటే ..(ఈ కవితకి నేను వ్రాసే వ్యాఖ్య దిష్టిచుక్క మాత్రమే) ఇక మా సంగతి ?
saarthaka naamadheyulu meeru.
raktam pulumukunE pudtunnaam manaM. puritinoppulu tappani sisodayamundadu kadaa? idi punaraavrutam kaavadame charitra.
ప్రదీప్,
ఎంత చక్కగా వ్రాసావో! చాలా రోజుల తరువాత.... నాకు చాలా చాలా నచ్చింది. భ్రమరార్జునుణ్ణి భ్రమరాంబ తల్లి చల్లగా చూడాలి. :)
నీ కవిత్వం నా మొద్దు బుర్ర్ర కు అర్థమై కాన్నట్టు ఉంది. కాని నువ్వు రాసే విధానం చూస్తుంటే నీ దగ్గర మంచి టాలేంట్ ఉంది అని నా మనసుకు తోస్తున్నాది. ఇంకా మంచి కవితలు రాసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటావని ఆశిస్తాను. అలాగే నాకీ పద్యానికి అర్థం రాసేది.
అందరికీ, ముందు దీని గురించి చిన్న విషయం,
కొన్ని రోజుల క్రితం,టివిలో పదహారేళ్ళ విధ్యార్ధి "...చంపుతా, నరుకుతా, ..." అంటూ ఆవేశంగా మాట్లాడుతున్నాడు. గట్టిగా పదహారేళ్ళ కుర్రాడికి ఏమి జరిగిందని, ఏమి ఆలోచనా శక్తి ఉందని ఆ ఆవేశం.
చంపితేనే వీరత్వమా? నరికితేనే ధీరత్వమా? రక్తాభిషేకమేనా గమ్యం?
ఆ రోజు అనిపించిన వాక్యం "వీరుడెవ్వడు మరుభూమిలో, ధీరుడెవ్వడు అమ్మ ఒడిలో". దాని చుట్టూ రాసుకున్న పదాల అలజడి అలలే ఇవి.
ఉష గారు,
మరీ అంత పెద్ద దిష్టిచుక్కా!! కొంచెం చిన్నది చెయ్యండి
పరిమళం గారు,
మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఎవరు ఏమంటే ఏమిటి. మీ అభిప్రాయం మీదే, వారి అభిప్రాయం వారిదే.
వర్మగారు,
చిరకాల దర్శనం.
ఆదిలక్ష్మి గారు,
ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి
అనానిమస్ ,
దీనికి అర్ధం, చావుకు పుట్టుకకు మధ్య పోలిక తెచ్చే ప్రయత్నం
Post a Comment