తారాజువ్వ - తోకచుక్క

కోటి ఆశలు నిప్పురవ్వలై,
ఆశయసాధన ఇంధనమై పైకెగిరింది తారాజువ్వ
ఒక్కో‌ఆశను తీరుస్తూ,
ఒక్కో‌అడ్దంకిని అధిగమిస్తూ పైపైకి ఎగిసింది
కనుచూపుకు అందని ఎత్తులకు ఎగురుతూ,
కనిపించని లోకానికి పయనమయ్యింది

ఎక్కడెక్కడా అని వెతికిన కళ్ళు అలసిపోయాయి

ఆశలు కోర్కెలయ్యాయి,
ఆ కోర్కెలు రెక్కలు తెచ్చుకుని
తారను వెతకగాఎగిరాయి నలుదిక్కులా
ఆకసంలో‌ ఉల్కలుగా మిగిలాయి

లక్ష్యసాధన తారను చేరిందేమో‌,
చిన్ని జువ్వ, ఆ చుక్కకు తోకయ్యింది నేడు
తీరని కోర్కెలు తీర్చగ పయనం‌ సాగించింది
ఒక్కో‌ఉల్కను ముద్ద్దాడుతూ, దాగిన కోర్కెను తీరుస్తూ
దూసుకువచ్చింది ఆ తోకచుక్క
===
ఎన్ని తారాజువ్వలు ఎగిసాయో‌ ఈ రాత్రి
ఎన్ని తోకచుక్కలు కోర్కెలు తీరుస్తూ వస్తాయో‌ రేపటి రాత్రిన

3 comments:

Apparao said...

వహ్ వా వహ్ వా

మరువం ఉష said...

అవును కదా, రాలే ఉల్క ఆశలని పైకి తెస్తుంది. జారే తోకచుక్క ఆశయసాధన జారనీయకని బోధచేస్తుంది.

నడుమ మీరు తారజువ్వని కలిపి వేసిన లంకె బాగా కుదిరింది. ఇక ఓ బుట్టెడు జువ్వలు, బస్తాడు ఆశయాలు పోగేస్తాను. :)

Unknown said...

అప్పారావు గారు,
షుక్రియా
ఉష గారు,
ఇంకేమి అంటాను, సరేననక