నాతో పోరాటం

పోరాటం నాతోనే
విజయం నాకే, అపజయమూ నాదే
నాతో నాకే శతృత్వం
నాపై నాకే లాలిత్యం

ప్రణయపు అరణ్యంలో
వేచి చూస్తున్న కన్యను చేపట్టమని పరుగులు తీసే మనసు

అది ప్రణయపు అరణ్యము కాదు,
ప్రళయాలను దాచిన ఎడారి అని అడుగాపే తెలివి

ఎడారి కాదది ఇరు ఎదలకు పరచిన దారని
పరుగిడమని ముందుకు పోయే మనసు

ఈ రెంటి పోరాటంలో గెలిచిన వారికి తోడుగా విధి
విధిని గెలిచే ప్రయత్నం కాదిది, వలచే ప్రయత్నమిది

విజయతిలకమైనా, వీరస్వర్గమైనా చేపట్టేది నేనే

మనసూ, తెలివి కలిసిన చోట పోరాటం జరగదు, జరిగేది పయనం
మనసూ, తెలివి పోరాడిన నాడు వచ్చేది ప్రళయం,
ప్రళయం నుంచి దూరంగా పయనం జరపాలి,
పయనిస్తూ విధిని తోడుగా తీసుకుపోవాలి

9 comments:

Online said...

bagundi..

hai said...
This comment has been removed by a blog administrator.
durgeswara said...

ఇంతకి పెళ్ళెప్పుడు ?

Padmarpita said...

Nice...

Yohanth said...

చాలా నచ్చింది.

మరువం ఉష said...

ప్రణయం ప్రళయం పయనం వెరసి పరిణయం ఆపై పరవశం - విరహం వివేకం విధివిధానం వెరసి వినోదం... కానీండి మనసు, తెలివి కలిసిమెలిసి మనిషిని తోడ్కొనిపొయే వైనాలివి.. నాతో కూడా పోరాటానికి వస్తారా? దేనికంటారా పద పద మంచు వానలోకి అనే మనసుకి, అగాగు అది మంచిది కాదు అనే తెలివికి నా పోరాటం, తోడు లేక ఆరాటం..;)

Unknown said...

ఆన్ లైన్ ,
థాంక్స్
హాయ్ ,
హై హై హాయ్ హాయ్
దుర్గేశ్వరా,
నా పెళ్ళి ఎప్పుడో నేను చెప్పగలనా, అంతా పైవాడి దయ. ఇక పైన కనిపించే నా మరో సమాధానం నాలోని మరో పార్శ్వం. కలలవిహారాలు, కవితాకన్నియతో సరసాలు, కవిరాజు సేవలు, చివర అప్పుడప్పుడు అలా వెలికివచ్చే నిర్లిప్తత
పద్మార్పిత, యొహనాథ్ ,
:)
ఉష గారు,
ఏమిటీ మీతో పోరాటమా, కాదు కాదు. అది మీతో మీకే పోరాటం, మీ మనసులో రగిలే భావానికి ఒక చిన్ని అక్షర రూపమిలా కనిపించేసరికి నాతో పోరాటానికి సిద్దమైతే ఎలా? కావాలంటే మీకు తోడుగా నేను కూడా పోరాటంలో మీ జట్టులో ఉంటా. ;)

madhavarao.pabbaraju said...

శ్రీ ప్రదీప్ గారికి, నమస్కారములు.

మీ భావుకత అత్యద్భుతంగా వున్నది.

భవదీయుడు,
మాధవరావు.

Unknown said...

మాధవరావుగారికి,
నమస్కారం. ఇలాంటి పోరాటాలకు అంతు లేదు. ధన్యవాదాలు.