కలలు – నీటి మీది రాతలు

కలలా వస్తావు, కలలా పోతావు
కలంరాతలా కలకాలముండరాదా
నీ ఊహలో వెచ్చబడి నిదురపోదు మేని
నిదురరానిదే కలలో కానరాదు నీ రూపు

కలలన్నీ కల్లలని కలలు కనని వారే అంటారట
కలలు వచ్చేది నిదురలోనా ?
కలలను స్వాగతించ వచ్చేది నిదురా ?

కలలన్నీ నీటి మీద రాతలట నిజమేనా ?
అవి మనసున్నవారే చదవగలరని చెబితే ఏమంటారో
రాతలు రాసిన చేతులేవని అడుగుతారా
నీటిలో వచ్చే తరంగాలను తోడు చూపనూ
మనస్సనే నీటిలో ఊహలనే చేతులు రాసే గీతలే కదా కలలు
ఆ మనో కడలి లోతు చూసినదెవరులే
ప్రతి ఉషస్సున తోడున్న నీతోడి కలలేగా

కలలన్నీ నీటి మీది రాతలే
కొన్ని రాతలు రాస్తూనే చెరుగుతాయి, ఎవరో చేయాడించినట్టు
కొన్ని రాతలు సుడిగుండాలను సృష్టిస్తాయి, ఎవరో చెయ్యిపెట్టి తిప్పినట్టు
కొన్ని రాతలు నీటిలోతును చేరి కలకాలముంటాయి, నదీ గమనాన్ని నిర్ధేశించే మలపులులా



9 comments:

మరువం ఉష said...

కలలని సాక్షాత్కారం చేయగ చేసే తపస్సు నిదుర.
కలలని సాకారం చేయగ నిలిచే ఉషస్సు నీదేగా.

కలలు కరగవు చెరగవు మరుగవవు
ఎద లయలో కొలువై మెదులుతూనేవుంటాయి.
*******************
తొలివ్యాఖ్య స్వార్థం ఇది. మళ్ళీ వస్తాను సుమా!

పరిమళం said...

మీ కవిత .....ఉష గారి స్పందనా బావున్నాయండీ ...పూవూ ....తావిలా ....

భావన said...

చాలా బాగుందండి. కల అంటేనే కరిగి పోయేది, నీటి మీద రాతంటేనే చెదిరి పోయేది.దానితో ఎంత చక్కని సాపత్యం రాసేరు.. చాలా చాలా బాగుంది.

కెక్యూబ్ వర్మ said...

కలల అలలపై తేలియాడితేనే జీవిత సాగరాన ఒడ్డుకు చేరగలం. లేకపోతే బతుకు నిస్సారమే కదా? కవిత చివరి పాదాలలోని ఆశ నెరవేరాలని కోరుకుంటున్నా...

Unknown said...

ఉష గారు,
తొలివ్యాఖ్య స్వార్ధం సరే, మలి వ్యాఖ్య పలకరింపేది
నా వచనానికి సరైన జత కలిపారు.
పరిమళం గారు,
:)
భావన గారు,
నీటి లోని సుడులు, ఆలోచనలు రేపే కలల అలలు కూడా ఉంటాయి సుమా
వర్మ గారు,
జీవితసాగరానికి వన్నె తెచ్చేది కలల అలలేగా

మరువం ఉష said...

కలలు, నా కలలు కల్లలు కాని కలలు
వూహా కన్నియలై, ఉరిమే మేఘాలై
వూగే పూరెమ్మలై, తూగే తూనీగలై
నేనన్న నిజాన్ని నాకు నిరూపిస్తూ..

*** నాకు కలలు గుర్తు చేసుకుని కొరిలేట్ చేసుకోవటం చాలా ఇష్టం. అందుకే నిద్ర లేవగానే వచ్చిన కలని పలకరిస్తూ నాతోనే ఆపేస్తాను. చెరగనీయను.

Unknown said...

అనుకున్నా, ఇలాంటి సమాధానమే వస్తుందని
కానీ జాగ్రత్త పీడకలను కూడా కొరిలేట్ చేసుకోకండి

మరువం ఉష said...

;) yeah finally we settled down with predictability of each other... I do correlate both nice and nightmares hence often times they impact my mood. yet i like it...

Unknown said...

:)