హృదయపు ఆకాశము

ఓటమి అమాసై పిలిచింది నిరాశను తామసై రమ్మని,
నిరాశ వచ్చింది ఆశల నక్షత్రాల తూటాలు చేసిన గాయాలతో ,
నివ్వెరపడి తడబడింది ఓటమి
రాతిరి నిశ్శబ్దంలో ఓటమి పెట్టిన గావు కేక విజయపు గీతమై
ఆశలవెన్నెలను ఆవిష్కరించింది

ఆశల కాంతులు తొలగించాయి గహణాన్ని
దూసుకు వచ్చింది విజయలక్ష్మి పున్నమి చంద్రునిలా
కోటి ఆశలు ఒక్కసారి కలగలసి
ఆకాశమంటి హృదయన్ని నింపివేసాయి
పున్నమి వెలుగు నిండింది ఎదలో

ఆశ తోడున హృదయపు ఆకాశము అనంతము
నిరాశ నీడన హృదయపు ఆకాశము శూన్యము

6 comments:

మరువం ఉష said...

మొత్తంగా బావుంది. కనీసం 10 సార్లు చదివాను అయినా ఎందుకో, "ఆశలవెన్నెలను ఆవిష్కరించింది" తర్వాత ఈ రెండు పంక్తులు మరోలా వ్రాసివుంటే అనిపిస్తుంది ఎందుకో...

ఆశల కాంతులు తొలగించాయి గహణాన్ని
దూసుకు వచ్చింది విజయలక్ష్మి పున్నమి చంద్రునిలా

As always your view at a thing is very unique and always "rakkasi, taamasi" are your popular and/or favorite characters. ;)

కెక్యూబ్ వర్మ said...

ఆశ తోడున హృదయపు ఆకాశము అనంతము
నిరాశ నీడన హృదయపు ఆకాశము శూన్యము
హృదయానికి శక్తినిచ్చారు సార్, ధన్యవాదాలు.

Unknown said...

ఉష గారు,
మీరే సూచించండి, ఏమి పెడితే బావుంటుందో.. ఆ క్షణం నాకు వేరే ఆలోచన రాలేదు. ఈ క్షణమూ రావడం లేదు. మీరే పుణ్యం కట్టుకోండి
"రాకాసి, తామసి" - నాకు తామసి అంటే ఇష్టం...
వర్మ గారు,
నన్ను సార్ అంటూ పెద్దవాడిని చెయ్యొద్దండీ

Vinay Chakravarthi.Gogineni said...

నిరాశ వచ్చింది ఆశల నక్షత్రాల తూటాలు చేసిన గాయాలతో ,
నివ్వెరపడి తడబడింది ఓటమి
రాతిరి నిశ్శబ్దంలో ఓటమి పెట్టిన గావు కేక విజయపు గీతమై
ఆశలవెన్నెలను ఆవిష్కరించింది

ప్రదీప్ చాల బాగా రాసావు....ఎందుకొ పైన వచ్హినంత బాగ రెండో చరణం రాలేదనిపించింది. పై లైన్స్ మాత్రం కేక. especially

ఆశల నక్షత్రాల తూటాలు చేసిన గాయాలతో ,

excellent prayogam.........

Unknown said...

వినయ్ గారు,
నాకు మొదట వచ్చిన ఆలోచన మొదటి చరణం మాత్రమే.. అది అమావాస్య గురించి కనుక, తరువాతి చరణం పున్నమితో ముగిద్దామని అలా రాసాను.
ధన్యవాదాలు

amma odi said...

"విజయ దశమి శుభాకాంక్షలు"