సత్య శోధన

నిజమెల్లప్పుడూ ఇంతే
పట్టుకుంటానంటే కాలుస్తుంది
దాచిపెడితే దాగనంటది
ఆకసాన సూరీడిలా వెలుగుతానంటది

ఎంత లోతున దాచిపెట్టినా,
భూగర్భం చీల్చుకు వస్తుంది
ఎంత దూరమిసిరేసినా అ
నంత దూరం పయనించి తన వాణి విన్పిస్తుంది

అణువంత చిన్నది
విశ్వమంత పెద్దది
ఆచరిస్తే అణువణువులో దాగి తోడుంటుంది
ఎదురు తిరిగితే విశ్వమంతా తానై ప్రళయం చూపుతుంది

అసత్యపు రధమెక్కి అవినీతి గుర్రాల స్వారీ చేసిన
అనంత సత్యం చేతిలో ఓటమి తప్పదుగా

సత్యాన్వేషణతో జీవినయానం చేసిన,
నీతి చంద్రికల తోడున విహరించిన
అనంత సత్యమున అంకితమే కదా

సత్యమా ఏమని అర్ధం చేసుకోను నిన్ను,
సత్యాన్వేషణలో తరించెను ఒక ఋషి,
సత్యము గోచరించిన మాత్రమున
నా నేత్రము కానరాని లోకాలకు వెడలె ఆ ఋషి
ఇంకెవరని అడగను నీవెవరో

(సత్యశోధన రాసిన గాంధీకి అంకితం)

6 comments:

బృహఃస్పతి said...

బావుంది... మేం కూడా ఇక్కడ సత్య శోధనచేసామండీ... :)

http://vikaasam.blogspot.com/

Hima bindu said...

సత్య శోధన బాగుంది .

పరిమళం said...

"అణువంత చిన్నది
విశ్వమంత పెద్దది
ఆచరిస్తే అణువణువులో దాగి తోడుంటుంది
ఎదురు తిరిగితే విశ్వమంతా తానై ప్రళయం చూపుతుంది"
చాలా బావుందండీ ...

Unknown said...

బృహస్పతి గారు,
చాలా బాగుందండి మీ సత్య శోధన, అది ఎప్పటికీ ఆగని ముగియని శోధనే
చిన్ని గారు,
మరి శోదిద్దాం పదండి
పరిమళం గారు,
నిజమే సత్యం అందమే కదా

మరువం ఉష said...

సత్యవాక్పరిపాలన ఉదంతాలు ఎన్ని చదివినా ఎందుకో ఆ సత్యానికి చేరువుగా పోవాలంటే భయం, ఆబద్దం ఆడకపోయినా నిజాన్ని దాచే నిరంతర యానం. మీ కవిత ఒక్కసారి చెళ్ళున తగిలింది...

Unknown said...

ఉష గారు,
"నిజాన్ని దాచే నిరంతర యానం" - నిజమే, అందరి జీవితాలు అదే కోవలో ఉన్నాయి ప్రస్థుత కాలంలో. గత వారం, సత్యశోధన మళ్ళీ చదువుతుంటే నాకు వచ్చిన భావాలు.