ఏమి మాయాజాలమో అది
ఎవరు తోసారు నను
వెలికి వచ్చే దారి లేదు
దరిచేర తీరము తెలియకున్నది
దిక్కులు తెలియని శూన్యమది
ఏ సూరీడుని వేడను
దినములు లెక్కించ తారా చంద్రులే కానరారేమి
క్షణముల లెక్క తేలకున్నది, క్షణమో యుగమో లెక్క తెలియదే మరి
శూన్యమున ఎన్ని అడుగులు వేసినా గమ్యము చేర్చదే
ఎచట చూసినా వెలుతురు కానరాదే
బాధను హృదయమున బందీను చేసి
సాగాను, ముందుకో వెనుకకో దిక్కులు తెలియవు
ఎచట నిలిచానో తె లియదు
హటాత్తున ఏదో వెలుగు నన్ను ముంచింది నన్ను నేనే మైమరిచేలా
నా ప్రేయసి కన్నుల వెలుగే అది
తెలిసిందిలే ఇన్నాళ్ళ నా శూన్యం దిక్కులు లేనిది కాదని
దిక్కులనే తనలోన దాచిన విశ్వమని
ఆమె కన్నుల, నే కాంచిన వెలుగులు
మరో విశ్వపు దారి చూపే కాంతిరేఖలు
====== మరి ప్రేయసి ఏమనుకుందో == ====
అతని కన్నుల జాలమే నా పట్టుపరుపు
వెలికి వచ్చే ఊహ కూడా రాదు, ఏమాయనో అతను అదృశ్యమాయె
ఆతని కన్నుల ఇంద్రజాలమున నన్ను బందీ చేసి
ఏ దిక్కున చూసినా ఆతనే , దిక్కులు తెలియకున్నవి
శూన్యమో ఏమో తెలియనిదేదో నన్నావహించింది
ఇంతలో గాలిలో ఏదో వెచ్చని పలకరింపు నను తాకింది
శూన్యము దాగిన నా కళ్ళలో ఏదో వెలుతురు
అది చూసి అతని కనులు చేసె ఏదో ఇంద్రజాలము
అతను చూపే మరో విశ్వానికి అతనివెంటే నడిచా
(అనంతవృత్తం మూడవభాగం రాద్దామని మొదలుపెడితే వచ్చిన ఔట్ పుట్ ఇది J )
9 comments:
మొత్తానికి రక్తి, అనురక్తి లేనిదే ముక్తి రాదని మళ్ళీ పునరావృతం అన్నమాట. మనిషికి మనసు, మాట, చూపు, ప్రేమ, అనుభూతి ఇవన్నీ ఈ అభినివేశాలు, అనురాగాలు ఇవన్నీ అనుభవంలోకి వచ్చాకనే అంతిమ లక్ష్యంవైపు మొగ్గగలడని నా స్వానుభవం. స్త్రీ, పురుష భావనలోని ప్రకృతి పురుష శక్తి, సాంగత్యం బలోపేతం. దాన్ని అధిగమించేకన్నా, ఆకళింపుచేసుకుని సంతృప్త మానసాన్ని దైవత్వం వైపు మొగ్గించటమే సన్మార్గం. మిమ్మల్ని ఉద్దేశ్యించినదేమీ లేదు. నా స్పందన మాత్రమే ఇది.
ఉష గారు,
నన్ను ఉద్దేశ్యించలేదని తెలిసిందిలెండి. మీరు చెప్పిన ఒక్కో మాట నిత్యసత్యాలు.
అనంత వృత్తం రెండు భాగాలు రాసినప్పుడు, కొందరు అనంత వృత్తాన్ని కొంచెం రొమాంటిక్ గా రాయమని కోరారు. అయితే మొదటీ రెండు భాగాలలోని ఆధ్యాత్మికం (?) నన్ను కొత్తగా ఆలోచించనివ్వలేదు. అందుకే రొమాంటిక్ గా రాసే ప్రయత్నంలో దారి తప్పి పైన కవితలా వచ్చింది. అయితేనేం, నాకు ఆనందమే. అందుకే ఇది ఓటమిచిహ్నంగా నేను భావించడం లేదు.
మనసు చేసే మాయాజాలాన్ని అందంగా వివరించారు ....రెండువైపులా మీరేఅయి ...
ధన్యవాదాలండీ, నా ఊహ వెళ్ళినంతవరకు వెళ్ళాను. నిజానికి ఆ మాయాజాలం తరగని గని.
మంచి భావము కలదు మీ కవితలో. కేవలం ఒక ప్రేయసి/ప్రియుడి భావాలు మాత్రమే ఎంచుకోకుండా, రెండింటిని పరిగణలోనికి తీసుకోవడం హర్షించదగిన విషయం. నెనర్లు.
Thanks for being with BLOGKUT
ఒక సూచన, రెండు ప్రశ్నలు.
సూచన: వ్యాఖ్యలకి మాడరేషన్ పెట్టండి.
ప్రశ్న 1: అమెరికా పని ముగిసి మాతృ దేశం చేరిపోయారా?
ప్రశ్న 2: ఆచార్య మిరియాల రామకృష్ణగారు మీకేమన్నా బంధువులా?
సాయి ప్రవీణ్ గారు,
ధన్యవాదములు. ప్రేయసి భావప్రకటన విషయంలో కొంచెం తడబడినట్టు నాకనిపించింది.
బ్లాగ్ కుట్ ,
థాంక్స్
కొత్తపాళీ గారు,
మీ సూచన పరిగణలోనికి తీసుకుంటాను.
రెండు ప్రశ్నలకూ ఒకటే జవాబు "అవును"
మిరియాల రామకృష్ణ గారు మా పెదనాన్నగారు. వారి స్ఫూర్తితోనే కవితలు రాయడం మొదలుపెట్టాను.
Post a Comment