నిశీధిలో నువ్వే, ఉషస్సులో నువ్వే

 

తామసి నీడన నేను తామసుడనవ్వగా
తామసమునున్న నాలోని కామకుడు నిదుర లేవగా
ఆ నిశీధిలో ఆ కామకునినెదిరింప నీవే
ఆ కామకునితో రసక్రీడలో నిస్త్రాణవైనావా

తామసి నీడను పారద్రోల దినకరుడు ఉదయించ
నాలోని కామకుడు అలసి సొలసి నిదురపోవ
ఈ ఉషస్సున నాలోని సాత్వికుని నిదురలేప నీవే
ఆ సాత్వికుని సత్యయాత్రలో తోడైనావా

సత్యయాత్రలో నీ తోడు నాకుండ నాకెదురేదని భావింప
నాలోని రాజసము నిదురలేవ కించిత్ గర్వమున
నిన్నే మరచిన రజోయోగమున  నీవే
నా రజోగుణంబు హరింప నియంతవైనావా

సర్వకాలమ్ముల సర్వయోగమ్ముల
నన్ను విడువక నా నీడవలె ఉంటూ నా
హృదయాంతరంగమున ప్రతిధ్వనించు
అనంత జీవన రాగము నీవేనైనావా

(ప్రేరణ: నా స్నేహితుడు మనోహర్ తన గూగులు టాక్ లో పెట్టిన స్టేటస్
"నిశీధిలో నువ్వే, ఉషస్సులో నువ్వే! నియంతవై నువ్వే, నా హృదయాంతరంగవై నువ్వే!!")

6 comments:

నేస్తం said...

chaalaa baagundi

మనోహర్ చెనికల said...

చాలా బాగుంది..

Anonymous said...

Agree with the above two - It's just great!

Unknown said...

రాసేప్పుడు భయపడుతూ ఉన్నా, మొదటి పేరా మీద ఎవరైనా విరుచుకుపడతారేమో అని. పర్లేదు ప్రస్థుతానికి అలా జరగలేదు :)
@నేస్తం, మలక్ పేట్ రౌడీ
ధన్యవాదములు.
@మనోహర్
ఈ క్రెడిట్ అంతా నీదే నిజానికి.....

మరువం ఉష said...

తామసమణచగ, రజో తత్వం, రజోగుణమదుపు చేయగ సాత్వికత్వం - ఈ త్రిగుణాత్మక మేలుకలయికే, పరస్పర సర్దుబాట్లే కదా సఫలం కాగల జీవన రాగాలాపనలు. కవిత ఇంకా బావుంది, నిజానికీ వ్యాఖ్య చాలదు.

Unknown said...

ఉషగారు,
నా భావం గమనించారు. ధన్యవాదములు.