ఎందుకు నాకీ పరుగు


ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు నా ఈ పరుగు
చిన్నప్పటి బుడి బుడి నడకలలోనా
పలక మీద ఓనమాలు దిద్దినప్పుడా
ఆత్మీయులపై అలకతో ఆకలితో పడుకున్నప్పుడా
అల్లరి చేసినందుకు బళ్ళో బెత్తం దెబ్బలు,
   మోకాలి శిక్షలు అనుభవించినప్పుడా
ఎదురింటి అమ్మాయి నన్ను చూసి కొంటెగా నవ్వినప్పుడా
బంగరు గాజులు చూసి ముచ్చటపడిన అర్ధాంగి
   కళ్ళలో కాంతి చూడాలనుకున్నపుడా
ఐస్ క్రీము కొనివ్వమని నా ముద్దుల పాప అడిగినప్పుడా
క్రికెట్ బాట్ కొనివ్వమని నా చిన్నారి బాబు కోరినపుడా

.

.

.

.

.

.


ఎందుకు నాకీ పరుగు ....
ఎవరికివ్వను నా గెలుపు ?

3 comments:

Anonymous said...

"ఎందుకు నాకీ పరుగు" కు పేరడీ :))


ఎప్పుడు మొదలయ్యిందో నాకీ తెగులు
రవిగారు బ్లాగుల్లో గొడవల గురించి యాహూ మేసేజ్ కొట్టినప్పుడా
వచ్చీ రాగానే యుద్ధం మొదలయినప్పుడా
నేను రాసిన కామెంట్లని సీనియర్ బ్లాగర్లు ఎగతాళి చేసినప్పుడా
దానికి ప్రతిగా ఈ ప్రమాదవనం మొదలెట్టినప్పుడా

తోటి సీనియర్లు చేసే ఆగడాలను చిద్విలాసంతో తిలకించిన పెద్దమషులు
ప్రమాదవనం విషయం లో శ్రీరంగనీతులు ప్రొద్దుగూకులూ ప్రచురించినప్పుడా?
కళ్ళు మూసుకుని మళ్ళీ ఉపసమ్హరించినప్పుడా?

ఓ పది బ్లాగులు లేకపొటే అంతర్జాలమే లేనట్టు బిల్డప్పులిచ్చినప్పుడా?

అక్కల కళ్ళలో కాంతి చూడడం కోసం తమ్ములుం చెంగలు
దండయాత్రలు చేసినప్పుడా?

ఏం చెయ్యాలో తెలియక బోరు కొట్టి లెఫ్టిస్టుల తోకలులాగినప్పుడా?

ఎందుకో నాకీ తెగులు
కాని భలే ఉంది - తెలియట్లేదు రాత్రీ పగలూ :))

--- Published it on my blog

PS: I was unable to login .. hence posting with this id

Unknown said...

మలక్ పేట్ రౌడీగారు,
మీ సెన్సాఫ్ హ్యూమర్ కి నా హాట్సాఫ్.అప్పుడప్పుడు నా బ్లాగులో లాగిన్ కావాట్లేదని చాలా మంది చెప్పారు. అందుకే ఎనానిమస్ కూడా ఎనేబులు చేసా. అది ఇలా పనికొచ్చిందన్నమాట.

మరువం ఉష said...

పరుగు కాదది, పయనం మిత్రమా, బహు దూరం సాగాలి, గెలుపు కాదది, గమ్యం, అది చేరేవరకు సాగాలి నీ పయనం ఇలా సరాగాల సుమ గీతమై..