శివశివా నీ ధ్యానం చాలిక,
జటనే తెంపి కొడతావో,
జటలే చెర చేస్తావో
శివశివా నీ ధ్యానం చాలిక,
త్రినేత్రం తెరుస్తావో,
తాండవమే చేస్తావో
శివశివా నీ ధ్యానం చాలిక,
మన్మధుని భస్మం కోసం ఆగావేమో,
ముష్కరుల కాల్పుల్లో కాలిన ప్రాణాలు చాలు
శివశివా నీ ధ్యానం చాలిక,
గౌరిని అపర్ణగా చూడాలని ఉందేమో,
హిమాభూమిలో రాలిన పర్ణాలు చాలు
శివశివా నీ ధ్యానం చాలిక,
చీమైనా కదిలే ఆజ్ఞ నీదేనట,
దుండగుల కాల్పులు కూడా నీ ఆజ్ఞయేనా
శివశివా నీ ధ్యానం చాలిక,
ఓం శాంతి వచనాలు వల్లించే ఓపిక లేదిక
ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి
1 comment:
ఓం శాంతి: శాంతి: శాంతి: 🙏🙏🙏
Post a Comment