నీవు లేక

నీవు లేక,

ఎన్ని రాత్రులు ఒంటరిగా గడిపానో, 

ఎన్ని పగల్లు నిస్తేజంగా ఉదయించాయో,  

ఎన్ని మాటలు శూన్యంలో కలిసిపోయాయో , 


నీవు లేక,

ఎన్ని భావాలు ఆచూకీ లేకుండా పోయాయో,

ఎన్ని క్షణాలు యుగాలై నిలిచాయో,

ఎన్ని శూన్యాలు నన్ను మింగేసాయో,


నీవు లేక,

ఎన్ని సార్లు నా ఆచూకీ అన్వేషణ చేసానో,

ఎన్ని సార్లు భారంగా యుగాల ఎడారి దాటానో,

ఎన్ని సార్లు నన్ను నేను శిక్షించుకున్నానో,


నీవు లేక,

ఎన్ని సార్లు నా అన్వేషణలు శూన్యాన్ని చూపాయో,

ఎన్ని సార్లు ఎడారి దారుల్లో హిమానదాలు కవ్వించాయో,

ఎన్ని సార్లు నా శిక్షల ఆకలి తీరలేదో!!


ఎవరు నీవు,

నీవు బందం అయితే నేను అనాధని,

నీవు జ్ఞానం అయితే నేను అజ్ఞానిని,

నీవు పరమాత్మ అయితే నేను జీవిని.

2 comments:

Saishankar chary said...

బావుంది సార్...
మీ నెంబర్ అందించగలరు

Phani Pradeep said...

నాకు email పంపగలరు. "pradeep[at]miriyala.in"