చుట్టూ చీకటి ముసుగు కప్పుకుని రాత్రి వచ్చింది
నాపై మోజు పడ్డ ఆకాశంలో తారలన్నీ కలిసి నా వైపే కైపుగా చూస్తున్నాయి ప్రపంచం మొత్తం అసూయ పడేలా
చుక్కలను కలిపే ముగ్గులా తారల మధ్యన తెల్ల మబ్బులు
ఆ తారలన్నీ మబ్బులతో కలిపి బాణంగా చేసి నావైపు వదిలాడు మన్మధుడు
గాలిలో తేలుతున్న దూదిపింజలా మబ్బుల బాణం నావైపు దూసుకు వచ్చింది
మబ్బుల్లో దాగిన మత్తుమందు నా మీద జల్లి,
తారలన్నీ ఒంటినిండా పరుచుకుని నన్ను కౌగలించింది చల్ల గాలి
సుకుమారమైన ఆమె స్పర్శకు ఒళ్ళంతా ఒక్కసారిగా వెచ్చబడింది
చలిలో దాగిన వేడి నా ఒంటరితనాన్ని బూడిద చేసింది
ఆ గాలిలో దాగిన శృంగార దేవత, నా శరీరాన్ని నిలువెల్లా ఆక్రమించింది
కాలితో పెనవేసుకుని, ఛాతిపై పరుండి, భుజంపై తలవాల్చి
తనతో తెచ్చిన హిమాన్ని పన్నీరులా నాపై చిలకరించింది
ఏమీ మధ్యన రాలేనంతగా నేనూ గాలి పెనవేసుకున్నాం
ఉత్తరం నుంచి దక్షిణం వరకు తానే నాతో
తూర్పూ పడమరల మధ్యలో మేము
(బాల్కనీలో ఒక రాత్రి ఒంటరిగా నుంచున్నప్పుడు వచ్చిన తుంటరి ఆలోచన)
13 comments:
చాల బాగుంది :-)
పెళ్ళీడొచ్చిందోయ్! :)
కొత్తపాళీగారి కామెంట్ కు డిటో :-)
అబ్బో! :):):)
అయితే త్వరలో
పీ...పీ...పీ
ఢుం..ఢుం..ఢుం!
పిల్లను చూడమని మీ ఇంట్లో వాళ్లకి ఎలా చెప్పడమబ్బా?? చెప్పేస్తే,వాళ్లు చూసేస్తే ,పెళ్లి చేసేస్తే ఓ పనైపోతుందిగా...:))
శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు...
శృంగారమనగానే పెళ్ళి మీదకు తోసిపారేసారు. ఏంటో శృంగారం చులకనైపోయింది.
అందరికీ ధన్యవాదాలు.
మెరిసే తారల చీర కట్టి, చందమామ ను బొట్టుగా పెట్టి, తెల్ల మబ్బులను మల్లె పూలలా తురుముకుని, నిశా వనిత
మంచు గంధం కలపి చల్లని గాలులతో కబరంపినట్టు ఉంది. :)
Swapna,
నేను రాసిన దాన్ని బాగా అర్ధం చేసుకున్నారు. ఇది కూడా చదవండి http://pradeepblog.miriyala.in/2009/04/blog-post_26.html
చాలా బాగుంది అర్జున్ గారు
అనుకోకుండా మీ భావాలనే మళ్ళీ మీకు వినిపించినట్టునా :(
Swapna,
పర్లేదండీ... ఒకే భావం ఎంత మందికైనా రావచ్చు...
chala baga rasaaru
మీ భావ వ్యక్తీకరణ చాలా బాగుందండీ!
Post a Comment