నదికెన్ని పాయలో
హృదయానికెన్ని గాధలో
ప్రతి వేణి గమ్యమూ ఒకటే, ప్రతి గాధకూ ముగింపొకటేనా?
నది చేరని తీరం
మదిలో తీరని కాంక్ష
ఆ తీరానికి నదిని తరిమేది ప్రళయం, మరి ఈ కాంక్షను తీర్చేదేది ?
ప్రతీ మలుపులో దాగిందో సుడి
ప్రతీ అడుగులో దాగిందో మలుపు
తీరానికి కానరాని అంత్:మధనాలు, హృదయాంతరమున దాగినదేమిటో
ఏనాటి ఆనందభాష్పాలు,
ఎచ్చటి వేదనరోదనభాష్పాలు
నది నిండా నీరే, ఆనందం దాగిందో వేదన నిండిందో హృదయములో, ఎవ్వరు చెప్పగలరు
ఉప్పెనలెన్నైనా మారని సంద్రం
కాలగమనమేదైనా చలించని విధి
నది గమ్యం దొరికింది, మరి హృదయ గాధల ముగింపు?
5 comments:
అన్నీ ప్రశ్నలే తప్ప సమాదానాలేమి కనిపించలేదండీ నాకు .. :(
:D
prasnala venaka javaabula kOsam saagE nirantara anveshane jeevitam..
నిజమేకదా!!!!!!
బుర్రలో ఎన్ని ప్రశ్నలో?
Cuty, పద్మార్పిత గారు,
ప్రశ్న వెనుకే సమాధానం దాగింది,ఆ సమాధానం వెంబడే జీవితం సాగుతుంది
కెక్యూబ్ గారు,
మీ మాటే నాదీనూ
Post a Comment