హరివిల్లు – 4

(అడగగానే, ఒక చెయ్యి వేసి ఈ సప్త కవితల సంకలనంలో పాల్గొంటున్న మరువం ఉష గారికి ధన్యవాదములు)

భానుని శ్వేతకిరణాలు తండవమాడుచున్న వేళ, ఒక చినుకు కురిసె
చినుకు తడికి తడిసి, మురిసి శ్వేతకిరణం ఏడు వర్ణములలో వన్నెలు పోసాగింది,
ఆ సప్త వర్ణాలూ తమ వన్నెలతో శ్వేతకిరణ సుందరికి అలంకారములవ్వగా
తన నెచ్చెలి తామసి తోడు లేక చిన్నబోయెనా నలుపు
తన అంశలగు సప్తవర్ణముల వన్నెలు చూస్తూ ఆనందమొందుచున్నదా శ్వేత సుందరి

ఆ వన్నెల నృత్యస్థలి ఆ నల్లనయ్య తలపైన దాగిన పించమే కాదా ?
చిన్నబోలేదులే నలుపు, తామసమునే జయించిన నల్లనయ్య తోడుండగా
ఆ నల్లనయ్యకే అలంకారమై నిలువగా

శ్వేత సుందరి అలగదులే
ఆ నల్లనయ్య చేత వెన్నముద్ద కదా ఆ శ్వేతసుందరి,

ఒక చేత మురళి, మరు చేత వెన్నముద్ద
దేహము నలుపు, శిరముపై హరివిల్లును చూపించు పించము

అన్ని వర్ణములూ కలిసిన ఆ క్షణము నా వర్ణనలకు లొంగునా ?

భానుడే మనమేమో
ఆ చినుకులే సత్యాసత్యాలేమో
శ్వేతకిరణాలు మనలోని భావనలేమో
ఆ రెండూ కలసిన క్షణమున వచ్చెడిది హరివిల్లంటి ఆత్మసాక్షాత్కారమేమో
తామసమును జయంచి తామసి నెచ్చెలిని మన అలంకారముగా చేసుకుంటే
వేడి వేడి భావనలు వెన్నంత చల్లగా అవుతాయేమో
ఆ క్షణమున మనిషే ఆ నల్లనయ్య అవునేమో

9 comments:

మరువం ఉష said...

మీదైన బాణి, మేలైన శ్రేణి అయిన కవిత. ఉత్తమాభిరుచి, వినూత్న అభినివేశం మీ స్వంతం. అభినందనలు.

చిలమకూరు విజయమోహన్ said...

beautiful

తృష్ణ said...

chAlA bAgumdamDii.

Unknown said...

@ఉష గారు,
ధన్యవాదాలు,
"ఉత్తమాభిరుచి, వినూత్న అభినివేశం మీ స్వంతం" - ఏమిటో ఈ మధ్య తెగ ఎక్కేస్తున్నా మునగ చెట్టు.
@విజయమోహన్ గారు,
అందాన్ని కని సంతసించితిరన్నమాట, సంతోషం.
@తృష్ణ గారు,
ధన్యవాదాలండి

శ్రుతి said...

చాలా బావుందండి.

చిలమకూరు విజయమోహన్ said...

నల్లనయ్యంటేనే అందం కదా మరి beautiful కాదా !

Unknown said...

శృతి గారు,
సంతోషం, మిగిలిన కవితలు కూడా చదవండి.
విజయమోహన్ గారు,
భలే చెప్పారు

పరిమళం said...

సప్త వర్ణాలూ మా కన్నయ్యలో పొదిగి అల్లిన కవిత !
ఇంకెలా ఉంటుంది ?మృదు మధుర మురళీ రవంలా ....

Unknown said...

ఆ కన్నయ్య కేవలం గోపికామానసచోరుడే కాదు, కవుల కలమున జారువాలే అక్షరమాలిక కూడా