అద్దంలో కొత్తగా నేను


అశాంతి కోటను బద్దలుకొట్టి
స్వప్నాల బాటను పరుగులు తీసి
ఆనందపు తోటను తెరచి
నన్ను నేను చూస్తే
అద్దంలో కొత్తగా నేను

జలధినై విహరిస్తూ  
వాహినిలో అలనౌతూ
జలపాతమై ఎగసిపడుతూ
ముత్యమై వెలికివస్తూ
నాకు నేను కొత్తగా నేను

0 స్పందనలు: