ఆ రోజు అర్దరాత్రి

సమయం: అర్ధరాత్రి
పోలీస్ స్టేషన్ ముందు ఇరవై బైకులు గుండ్రంగా తిరుగుతున్నాయి. పోలీసులు నిశ్శబ్దంగా చేతులు కట్టుకుని చూస్తున్నారు. ట్రాఫిక్ పెరగడం గమనించి బైకు నడుపుతున్న వాళ్ళు దారి ఇచ్చారు, ఏదో అరుస్తున్నారు వాళ్ళంతా. పోలీసులు నిశ్శబ్దంగా చూస్తూ ట్రాఫిక్ ని ముందుకు పంపుతున్నారు.
ముందుకు వెళ్తే ఆ అర్దరాత్రి ఏదో జాతరలా పిల్లలు రోడ్డు పక్క ఎగురుతున్నారు. ఎవ్వరూ ఏమీ అనటం లేదు. ఇంకాస్త ముందుకు వెళ్తే మందుషాపులు మాత్రం దగ్గరుండి మూయిస్తున్నారు పోలీసులు.
మరింత ముందుకు వెళ్తే ఒక ముసలమ్మ చిరునవ్వులు నవ్వుతూ మానవడితో ఏదో చెప్తోంది.

ఏమయ్యింది ఆ రాత్రి ???
ఏమయ్యిందో అందరికీ తెలిసిందే అది. చిన్న పిల్లాడి నుంచి ముసలివాళ్ళవరకు అందరికీ పిచ్చి పెంచేసిన వరల్డ్ కప్ ఫైనల్ ఆ రాత్రి.

జాతి మొత్తం ఒక్కటి అయ్యింది అంటారు, ఆ రాత్రి చూశాను కళ్ళారా!
ఈ ఐకమత్యాన్ని దేశ సమగ్రతకు వాడగల నాయకుడున్నాడా ?

0 స్పందనలు: