అమావాస్య నాటి వెన్నెల - 3

ముందుకు అడుగు వేసానే గాని భారమైన ప్రయాణము అనే మాటకు అర్ధం ఇదేనేమో అనిపించింది ..
నడిచా ! చూసే సరికి నా గీత, నాలోని స్వప్నకు.. మా ప్రయాణానికి గుర్తులైన ఆల్బం చూపిస్తోంది ..
నా లోకం మాత్రం వేరే ,
స్వప్నను గీతను మార్చి మార్చి చూసా..
స్వప్న నను స్వప్నం లో కవ్వించినది ఐతే, గీత నా ప్రతి నిజ కదలికలో భాగస్వామి ..
గీతతో పంచుకున్న భావాలు ఎన్నో స్వప్నతో పంచుకోలేక నా ఎదలోనే ఇమిడ్చిన భావాలూ అన్నే !!!
ఒక్క క్షణం గతం గోడలు తడుతూ నను నేనే మరిచీ,
నా ఏ కదలికా వదలని నా చెలి (గీత) నను గమనిస్తుంది అన్న విషయమూ మరచి ..
తేలుతున్నా నా ఊహల్లో ..
కోరుకున్న ప్రతీది దక్కించుకునే పట్టుదల ఉన్న నేను నా ప్రేమలో ఎలా ఓటమిని అంగీకరించానా అని ప్రశ్నించుకుంటూ విహరిస్తున్నా నా స్వప్న లేని స్వప్నాలలో ..
ఇంతలో "నా పెళ్ళికి మాత్రం మీ జంట తప్పక ఉండాలి" అంటున్న స్వప్న ..
ఉలిక్కిపడి చూసా చెమ్మగిల్లిన గీత కళ్ళని..
కలా నిజమా అనేంత క్షణం లేవు ఎన్నో మాటలలానే తనలో అణచేసుకుంది ..
స్వప్నకు వీడ్కోలిచ్చి ఇద్దరమూ కదిలాం మా కుటీరంలోకి ..
గీత మాత్రం జార్చిన పూలను ఏరుతూ ముంగిటే ఆగింది .. తనను ఒంటరిగా వదలలేకపోయా .. ఒక్క క్షణం నేను చేసినది తప్పా అనే ఆలోచనలో పడ్డాను !
సహాయం చేస్తున్నట్టుగా చేయందించాను..
"అయ్యో భలేవారే నేను ఏరుతానుగా !! పూలు తోక్కకూడదు అందుకనే .. వచేస్తున్నా! మీరు పదండి ఒక్క నిముషం.." అంటూ సులభంగా నను కదల్చింది క్షమాపణా సహిత ఆలోచనల్లోంచి !!!
నా అడుగులు మరలా కదిలాయి .. కాని భారంగా కాదు

5 comments:

సుమ said...

బాగా రాసారండి .. మీ కవితల్లో ఉద్వేగంతో పాటు ఈ కళ కూడా ఉందనుకోలేదు సుమా !!!

చిన్ని said...

మీ అమావాస్య నాటి వెన్నెల చాలా బాగుంది .

'Padmarpita' said...

బాగుందండి

పరిమళం said...

క్షమయా ధరిత్రీ .....కదండీ మరి !

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

సుమ గారు,
అంతే కదండీ మరి 64 కళలన్నారు కదా !
చిన్ని గారు, పద్మార్పిత గారు,
మీ స్పందనకు నా కృతజ్ఞతలు !
పరిమళం గారు,
మీరన్నది నిజమే సుమా ..
ఒక్క మాటలో మనం తేల్చినా అనుభవించడం కష్టమేమోగా నేను కల్పించిన పాత్రలో ఉన్న స్త్రీకు !
తెలుపడానికిదో చిన్న ప్రయత్నం