" ఏంటి అస్త్ర శస్త్ర సన్యాసం చేసేసేవంట, ఏమి రోయ్ "
" ఎవరన్నారు"
" ఒకరనేదేమిటోయ్ ... నేనే అంటున్నా "
" ఏంటట సాక్ష్యం "
" ఏమి రాస్తున్నావు ఈ మధ్య?, పేరేమో అర్జునుడి బాణాలు అని గొప్పగా పెట్టావు "
" ... "
" అసలు నీ రాతలేమిటోయ్.. శూన్యమా... నిశ్శబ్దగీతమా.. అది సరే గానీ ఈ మధ్య ఎవరినీ పలకరించటంలేదట, ధ్యానమా, సన్యాసమా "
" ... "
" ఏం ఈ మధ్య ఎవరినీ విమర్శించటం లేదట, ఎవరినీ పొగడను కూడా పొగడడం లేదట "
" అయ్యిందా నీ విమర్శల పర్వం "
" ఆ చెప్పాలంటే చాంతాడంత ఉందిలే. ముందు నువ్వు చెప్పు ఏంటి సంగతి "
" ఒరే బాబూ, ఇలా అన్నానని నన్ను ముసలాడిని చేసేసి నువ్వు పసిబాలుడివనుకుని మునగచెట్టెక్కేవు "
" ముందు నువ్వు చెప్పవోయ్ "
" శూన్యంలోకి వెళ్ళడమూ, రావడమూ అంత త్వరగా జరిగే పనులేనా "
" ఏమిటోయ్ తలా తోకా లేకుండా వాగుతావ్ "
" ఏమీ లేదోయ్ , ఈ మధ్య మన మీడియాలో న్యూస్ చానెళ్ళు చూసి బుర్ర పిచ్చి ఎక్కిందిలే "
" నీ రాతలకూ, ఆ కోతలకూ సంబంధమేమిటట "
" ఆ కోతలు చూసి నవ్వొచ్చి, ఏమీ రాయలేకపోతున్నా "
" ఓహో, బాధిత పర్వంలో ఉన్నావా "
" ... "
" అయితే ఆ బాధలైనా రాయొచ్చు కదా "
" బాధల చేదుమాత్రలు కూడా పంచాలా "
" పంచితే, చేదు పోతుంది కదా. మిగిలేది ఖాళీ డబ్బా, ఆ డబ్బాలో రుచికరమైన మాత్రలు నింపొచ్చు కదా "
" నిజమేరోయ్ , అప్పుడప్పుడు నువ్వు కూడా బానే చెప్తావ్ "
" మళ్ళీ కోతలు, నేను నీ ఆత్మను రా. ఆత్మ మీద అనంత వృత్తం రాసేసేనని ఫోజు కొట్టావు. రాతలన్నీ కోతలేనా ? "
" అనంతవృత్తంలోనే చెప్పానుకదా, ఏదో ఒకటి నన్ను బయటకు లాగుతుందని. అదీ సంగతి "
" ఓహో అలా అన్నావా, మరి రాసేప్పుడు అన్నీ తెలిసిన వేదాంతిలా చెప్పావు "
" చెప్పడానికి వంద చెప్పొచ్చు, ముఖ్యంగా ఈ మధ్య వార్తా చానళ్ళు చూసాక తెలుసుకున్న నగ్న సత్యమిది "
" సమవర్తిలా వ్యవహరించాల్సినవే ద్వంద వైఖరి అవలంబిస్తుంటే, ఆ ద్వంద వైఖరిని ఆచరిస్తానంటావేం "
" నిజమేరోయ్ , ఈసారి చెవిలో దూది పెట్టుకుంటా, "
" మరి చేతిలో ఏమి పెట్టుకుంటావు ? "
" కలం, అదే నీ భాషలో బాణం "
" మరి ఎవరో నీ గురించి బెంగ పడ్డారంట వారి సంగతేమిటి "
" బెంగ పడితే దండగేనోయ్.... "
" ఆపు, మళ్ళా వైరాగ్యమా "
" సరే, ప్రయత్నిస్తాలే "
" మళ్ళా, లే అంటావ్ .. తంతా "
" ఇదే నీతో వచ్చిన తంటా. నే కదులుతా ఇంక, నువ్ పోవోయ్ అద్దం వెనుకకు "
" సరే మరి, పోతున్నా.. చూస్తూనే ఉంటా... "
" హమ్మయ్య "
--- రేయ్ మొద్దు నిద్రలో ఏమిటా కలవరింత, లే లేచి ఒక కవిత రాయ్
ఏరా రోయ్
Subscribe to:
Post Comments (Atom)
7 స్పందనలు:
Baagundi.
ఆ..అలాగే లేచి ఒక కవిత రాసేసి పోస్ట్ చేసెయ్యండి మరి..!!
బాగుందండీ మీరు..మీ అంతరాత్మ చాటింగు.. :) :)
బాగుందండీ!
నిజానికి ఆ కలలో కొచ్చింది నేను ప్రదీప్ ;) మీ ఆత్మ కాదు. పైగా పోట్లాడి పొగడటం లేదని బెంగ పెట్టుకున్నదీ నేనే. అందుకే అస్త్రసన్యాసం చేసారా అని అడిగేను. ;)ఇంతకీ మంచమ్మీంచి లేవబోయి క్రింద పడ్డారా కాళ్ళమీద నిలబడ్డారా? శూన్యం రోదసి అన్నారని, చందమామ మీద దిగాననుకుని గాల్లో తేలిపోయారేమోనని అడిగా అంతే అంతే అంతే!!!!!! :)
సునీత గారు,
ధన్యవాదాలు
మధురవాణి గారు,
మధురంగా చెప్పారు. ప్రయత్నిస్తాను. ప్రయత్నించాలనే ఇది రాసాను
సృజన గారు,
ధన్యవాదాలు, మీ పేరు మీద ఒక కవిత రాసాను అప్పుడెప్పుడో ఒకసారి చదవండి ( http://pradeepblog.miriyala.in/2009/09/blog-post_11.html)
ఉష గారు,
కొన్ని డైలాగులు మీవే. అంత మాత్రాన మొత్తం మీదే అనేస్తారా? మీరు అడిగినా శూన్యం గురించి ఏమి చెప్తాను
ఇదేదో బాగుందే, నేను ఒక్క మాట అడిగాను "అస్త్రసన్యాసం చేసారా?" మీరు ఇంచక్కా "కొన్ని డైలాగులు మీవే" అనారు. కనుక "కొన్న మాటలు" నావే అంటే "అన్నీ మీవే" అంటారా? బాగుంది బాగుంది ..... ;)
ఎంత కొన్ని డైలాగులు మీవైతే మాత్రం మొత్తం మీదని ఏనాడూ అనం, ఎందుకంటే ఎంత మీ డైలాగులే 90% అనుకున్నా, ఏదో 10% మా డైలాగులుంటాయి కదా. ( 10-90 సూత్రం తెలుసు కదా;) :) )
Post a Comment