రామా నీలిమేఘ శ్యామా.. (అర్ధమేమిటి?)

నిన్న యధాలాపంగా "రామా రామా రామా నీలిమేఘ శ్యామా " అన్న పాట విన్నా.
పాట బాగుంది, సంగీతమూ బాగుంది, పాడిన గొంతు అంతకన్నా బాగుంది.

అన్నీ బాగుంటే కోడిగుడ్డుపై ఈకలు పీకే కార్యక్రమమెందుకు ?

నీలిమేఘ శ్యామా...
ఆకాశంలో ఏనాడు నీలి రంగులోనున్న మేఘాలు చూడలేదు. ఆకాశం నీలి రంగులో ఉంటుంది
కానీ మరి నీలి మేఘాలేమిటీ ? నల్ల మబ్బులున్నాయి, తెల్ల మబ్బులున్నాయి
మధ్యలో నీలి మేఘాలేమిటి?

శ్యామమంటేనే ముదురు నీలి రంగు. మళ్ళీ దానికి ఈ విశేషణమేల ?

బహుశా కవి భావం నీలమేఘమేమో ?
నీల అంటే నలుపు అనే అర్ధముంది, దానికి "ఇ" కారం జోడించి పాడడం వల్ల అర్ధం మారినట్టనిపిస్తోంది.
( ఉదాహరణకు "నీలవేణి" అంటే నల్లని జడ కలది అని అర్ధం)

ఒకవేళ కవి భావం నలుపు అనుకుందాం, అప్పుడు నలుపుతో కలసిన శ్యామ వర్ణం కలవాడు అని అర్ధం వస్తోంది.
బహుశా ఇది సరైన అర్ధమే కావచ్చు.

అందుకే బాల సుబ్రమణ్యం గారు అంటుంటారు, గాయకులు పాటను అర్ధం చేసుకుని పాడాలని.

ఇంతకూ నా భావం సరైనదేనా లేక నేను పప్పులో కాలేసానా?
లేకపోతే ఆ గాయని అనుకున్నట్టు నిజంగా నీలపు రంగులో మేఘాలున్నాయా ?
లేకపోతే ఆకాశం అసలు రంగు నలుపైతే మనకు నీలమెలా కనిపిస్తోందో ఇదీ అలాంటీ దృశ్య (భావ) వంచనా ?

తెలిసిన వారు తెలియపరచండి., తెలియని వారు నాలాగే ఒకసారి ఈకలు పీక నాతోడు రండి...

(ఇది కేవలం ఆ పాటపై విమర్శ, దయామయుడైన శ్రీరామునిపై కాదు. కావున ఆ కోణంలో విమర్శించే వ్యాఖ్యలు తొలగించబడతాయి. ఏమి చేస్తాం మత విమర్శకులెక్కువవుతున్నాయి కదా)

6 comments:

హరే కృష్ణ said...

chinnapudu manam sky is blue ani antamu tellaga vundi ani ekkada vinaledu..srikrishna prabhuvu
meeru gamaninchi nattu aithe hindi lo nilimegha shyama anna mata vinaru ekkadakooda.. mana vallu lyrics kosam edit chesi vuntaru
prabhuvu ni kolichetappudu mana manassu pavitram ga vunte chalu..andriki tandri ayina krishnude annintiki karanam ani telusukunte chaalu

పరిమళం said...

వర్షించేముందు మేఘాలు నలుపుతో కలసిన వర్ణం లోనే ఉంటాయికదా ...ఆ రంగు రామునిదని ఉద్దెశ్యమేమో ....

Unknown said...

valla ramuduni neeli mega shyamudu ga uhinchinatttunaru bhusha......

ఊకదంపుడు said...

ఎక్కడదండీ ఈ పాట?
శ్యామమంటేనే ముదురు నీలి రంగు ->నిజమా అండి?
నీలి మేఘాలలో ... గాలి కెరటాలలో అని ఒక పాట పాట కూడా ఉందిగా .

Unknown said...

@హరేకృష్ణ గారు,
నిజమే ఆ ప్రభువుని కొలవడానికి మనసు పవిత్రమైఅతే చాలు. కానీ ఇక్కడ చర్చ ఆ పాటలో వాడిన పదం గురించి.
@పరిమళం గారు,
అవును అదే వారి భావం కావచ్చు. అయితే నా బాధ అంతా నీలి మరియు నీల గురించి
@అజయ్ గారు,
రాముడు నీల మేఘ శ్యాముడు, కానీ నీలి మేఘ శ్యాముడు కాదు అని నా ఉద్దేశ్యం.
@ఊకదంపుడు గారు,
ఈ పాట శివమణి అనే పిచ్చి సినిమాలోది లెండి. అయితే ఈ పాట అంతకుముందే ఉందేమో తెలియదు.
శ్యామమంటే ముదురు నీలి రంగేనండి. (http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=శ్యామ&searchhws=yes&table=brown)
ఇప్పుడే మీరు చెప్పిన పాట విన్నా, బహుశా నీలి మరియు నీల అన్నవి ఒకే పదంగా భావించి కవులు వాడారేమో, శృతిలో కలవడానికి. ఆ పదాలు మారడం వల్ల వచ్చే ప్రమాదమూ పెద్దది కాదు కదా మరి.
ఇలా "నీలి మేఘాలు" అనే ప్రయోగంతో పాటలు రాసినవారు మహామహులు. తప్పు వారిదా లేక తప్పుగా నేను అర్ధం చేసుకున్నానా ?
(ఇంకా మరిన్ని పాటలు అలాంటివి http://www.chimatamusic.com/search.php?st=neeli&sa=Go!)

pradeep said...

మీ విశ్లేషణ చాల బాగుంది